నిత్యం మీరు వాడే టూత్‌పేస్ట్‌ల వ‌ల్ల ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో తెలుసా..?

తెల్ల‌వారిందంటే చాలు హ‌డావిడిగా లేచి టూత్ బ్ర‌ష్ ప‌ట్టుకుని బాత్ రూంలోకి ప‌రిగెడ‌తాం. ఏదో అటు ఇటు ఒక రెండు నిమిషాల పాటు దంతాల‌ను తోమి తోమి చివ‌ర‌కు ఎలాగో బ్ర‌షింగ్ పూర్తి చేస్తాం. అది పూర్త‌య్యాక మ‌న ప‌ళ్లు ఎంత తెల్ల‌గా ఉన్నాయో అద్దంలో ఓ సారి చూసుకుంటాం. అంతే ఆ త‌రువాత వాటి గురించి ఆలోచించేది త‌రువాతి రోజే. ఈ సంగ‌తి ఎలా ఉన్నా అస‌లు ప‌ళ్లు తోమేందుకు వాడే టూత్ పేస్ట్‌లోనే ఉన్న‌దంతా ఉంది. ఇంత‌కీ మ‌నం వాడే టూత్‌పేస్ట్ వ‌ల్ల ఏం జ‌రుగుతుందోన‌నే క‌దా మీ డౌట్‌, ఇంకెందుకాల‌స్యం, వెంట‌నే ఆ డౌట్‌ను క్లియ‌ర్ చేసుకుందాం రండి.

toothpaste

ప‌లువురు ప‌రిశోధ‌కులు ఇటీవ‌లే మార్కెట్‌లో ల‌భిస్తున్న దాదాపు అన్ని కంపెనీలకు చెందిన అన్నిర‌కాల టూత్‌పేస్ట్‌ల‌పై ప‌రిశోధ‌న‌లు చేశారు. వారి ప‌రిశోధ‌న‌ల్లో తెలిసిందేమిటంటే టూత్‌పేస్ట్‌ల వ‌ల్ల మ‌న దంతాలు తెల్ల‌గా రావడం, నోరు శుభ్రం అవ‌డం మాట అటుంచి వాటి వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయ‌ని తెలిసింది.

1. నోట్లో ఉండే క్రిముల‌ను నాశ‌నం చేసేందుకు గాను టూత్ పేస్ట్‌ల‌లో ట్రిక్లోసెన్ అనే ఓ ర‌క‌మైన కెమిక‌ల్‌ను క‌లుపుతారు. దీని వ‌ల్ల నోట్లో ఉన్న క్రిముల మాటేమోగానీ జ‌నాల‌కు థైరాయిడ్‌, గుండె సంబంధ వ్యాధులు, ప‌లువురికి క్యాన్స‌ర్ కూడా వ‌స్తుంద‌ని తెలిసింది.

2. పాలీ ఇథైలిన్ అనే కెమిక‌ల్ మ‌న శరీరానికి హాని క‌లిగిస్తుంది. దీన్ని విష ప‌దార్థంగా సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే ఈ కెమిక‌ల్ టూత్‌పేస్ట్‌ల‌లో కూడా ఉంటుంద‌ట‌. దీని వ‌ల్ల మూత్ర‌పిండాలు, మెద‌డు సంబంధ అనారోగ్యాలు క‌లుగుతాయ‌ట‌.

3. టూత్ పేస్ట్‌ల‌లో వాడే ఫ్లోరైడ్ వ‌ల్ల దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు రావ‌డంతోపాటు చిన్నారుల్లో తెలివి తేట‌లు కూడా త‌గ్గిపోతాయ‌ట‌.

4. ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌ల‌ను గ‌ర్భిణీలు అస‌లు వాడ‌కూడ‌ద‌ట‌. దీని వ‌ల్ల వారిలో పోష‌కాహార లోపం వ‌స్తుంద‌ట‌. థైరాయిడ్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉంటాయ‌ట‌. క‌డుపులో ఉన్న బిడ్డ ఎముక‌ల దృఢ‌త్వాన్ని ఫ్లోరైడ్ అడ్డుకుంటుంద‌ట‌.

5. టూత్ పేస్ట్ త‌యారీలో సోడియం లారిల్‌ సల్ఫేట్‌ను వాడుతారు. దీని వ‌ల్ల నోట్లో అల్సర్‌లు, పుండ్లు ఏర్ప‌డ‌తాయి. అంతే కాకుండా చ‌ర్మ సంబంధ స‌మ‌స్యలు వ‌స్తాయి. హార్మ‌న్ల ప‌నితీరులో అస‌మ‌తుల్య‌త నెల‌కొంటుంది.

6. తీపి ప‌దార్థాలు ఎక్కువ‌గా తింటే దంతాలు పాడ‌వుతాయ‌ని చెబుతారు. ఈ క్ర‌మంలో టూత్‌పేస్ట్‌ల‌లో కూడా చ‌క్కెర కొంత భాగంలో ఉంటుంది. దీని వ‌ల్ల మ‌ధుమేహం, స్థూల‌కాయం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. కొంద‌రిలో బ్రెయిన్ ట్యూమ‌ర్ వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ట‌.

కాబ‌ట్టి తెలిసిందా, టూత్‌పేస్ట్‌ల వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో. అయితే మ‌రి ఏవి వాడాలి అంటారా? మ‌న పూర్వీకుల మాదిరిగా వేప పుల్ల‌లు, ఉత్త‌రేణి వేర్లు, బొగ్గు పొడిల‌ను పళ్లు తోమేందుకు వాడితే బెట‌ర్‌. అవే మ‌న దంతాల‌ను సంర‌క్షిస్తాయి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top