కొబ్బ‌రికాయను ఇలా వాడిచూడండి, అందం+ఆరోగ్యం మీసొంతం.

కొబ్బ‌రికాయ‌ను కొట్టి దేవుళ్లను పూజించ‌డం హిందూ సాంప్ర‌దాయంలో ఎప్ప‌టి నుంచో ఉంది. అదేవిధంగా కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఎన్నో పోష‌కాల‌కు నెల‌వైన కొబ్బ‌రి నీళ్ల వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉన్న రుగ్మ‌త‌లు తొల‌గిపోతాయి. ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. అయితే కొబ్బ‌రికాయ‌లు, కొబ్బ‌రి నీళ్లే కాదు, కొబ్బ‌రి పాల వ‌ల్ల కూడా మ‌నకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ప‌చ్చి కొబ్బరిని తిన‌లేని వారు దాన్నుంచి తీసిన పాల‌ను తాగితే ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రికాయ‌ల నుంచి ప‌చ్చి కొబ్బ‌రిని తీసి వాటిని ముక్క‌లుగా క‌ట్ చేయాలి. ఆ ముక్క‌ల‌ను మిక్సీలో వేసి పేస్ట్‌లా ప‌ట్టుకోవాలి. అనంత‌రం ఆ పేస్ట్‌కు కొంత నీరు క‌లిపి దాన్ని మెత్త‌ని గుడ్డ‌లో వేసి క‌ట్టి దాన్నుంచి ర‌సం పిండినట్టు పిండుతూ కొబ్బ‌రి పాల‌ను తీసుకోవ‌చ్చు. ఇలా తీసిన కొబ్బ‌రిపాలతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు చూద్దాం.

coconut-milk

  •  కొబ్బ‌రి పాల‌ను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటుంటే దాంతో మ‌న శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ పెరుగుతుంది. ఇది కొవ్వును వేగంగా క‌రిగించ‌డ‌మే కాదు, శ‌రీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. దీంతోపాటు క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఇది బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది.
  • కొబ్బ‌రిపాల‌లో లారిక్ యాసిడ్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబియ‌ల్, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్ ధ‌ర్మాల‌ను క‌లిగి ఉంటుంది. దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి శ‌రీరానికి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ప్ర‌ధానంగా హెర్ప‌స్‌, ఇన్‌ఫ్లూయెంజా వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
  • కొబ్బ‌రిపాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది. ఇది గుండెకు చాలా మేలు చేస్తుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది.
  • కొబ్బ‌రిపాల‌లో మ‌న చ‌ర్మానికి, వెంట్రుక‌ల‌కు సంర‌క్ష‌ణ‌నిచ్చే ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన పోష‌కాలు మెండుగా ఉన్నాయి. ఇవి చ‌ర్మానికి కాంతిని తెస్తాయి. మృదువుగా చేస్తాయి. వృద్ధాప్యం కార‌ణంగా చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌ల‌ను త‌గ్గిస్తాయి. వెంట్రుక‌ల‌కు ర‌క్ష‌ణ‌నిస్తాయి. జుట్టు ఎక్కువ‌గా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
  • కొబ్బ‌రి పాల‌ను ముఖానికి, మెడ‌కు ప‌ట్టించి 30 నిమిషాల పాటు వేచి ఉండి అనంత‌రం చ‌ల్ల‌ని నీటితో కడిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంత‌మ‌వుతుంది. మృదువుగా మారుతుంది.
  • రాత్రి పూట ప‌డుకునే ముందు చ‌ర్మానికి కొబ్బ‌రి పాల‌ను రాసి ఉద‌యాన్నే క‌డిగేయాలి. ఇలా చేస్తే చ‌ర్మం పొడిబార‌దు.
  •  ఎండ కార‌ణంగా న‌ల్ల‌బ‌డిన చ‌ర్మం మ‌ళ్లీ పూర్వ రంగును పొందాలంటే సంబంధిత ప్ర‌దేశంపై నిత్యం కొబ్బ‌రిపాల‌ను రాయాలి. దీంతో కొద్ది రోజుల్లోనే చ‌ర్మం మళ్లీ సాధార‌ణ స్థితికి వ‌స్తుంది.
  • కాస్మొటిక్స్ ప‌డ‌ని వారి చ‌ర్మానికి అప్పుడ‌ప్పుడు దుర‌ద‌లు, రాషెస్ రావ‌డం స‌హ‌జ‌మే. అయితే అలా వ‌చ్చిన‌ప్పుడు స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంపై కొద్దిగా కొబ్బ‌రి పాల‌ను రాసి కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. దీంతో రాషెస్ పోతాయి.
  • కొద్దిగా కొబ్బ‌రి పాల‌ను తీసుకుని వాటికి ఆలివ్ ఆయిల్‌ను కొంత క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని నిత్యం ముఖానికి రాస్తుంటే ముఖం కాంతి పెరుగుతుంది. మృదువుగా త‌యార‌వుతుంది.

Comments

comments

Share this post

scroll to top