కరివేపాకే కదా అని తీసిపారేయకండి…”కరివేపాకు” చేసే మేలు ఏంటో తెలుసుకోండి!

కరివేపాకా అని తీసిపారేయకండి… దాని వల్ల ఉన్న లభాలు తెలుసుకుంటే ఇంకెప్పుడూ అలా పారెయ్యరు..అవేంటో తెలుసుకోండి..

  • కడుపులో తేడాగా రకరకాలుగా ఉంటే రెండు స్పూన్స్ కరివేపాకు రసంలో ఓ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పంచదార కలిపి తాగండి ప్రశాంతం గా ఉంటుంది.
  • కరివేపాకును పేస్ట్ లా చేసి, ఒక స్పూన్ పేస్ట్ ని ఒక గ్లాస్ పల్చని మజ్జిగలో కలిసి అప్పుడప్పుడూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
  • శరీరబరువును, రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు కరివేపాకులో అధికంగా ఉంటాయి. కాబట్టి వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు రోజూ ఉదయం పది పదిహేను కరివేపాకు ఆకులని తినెయ్యండి.
  •  కాలిన గాయాల మీద కరివేపాకు పేస్ట్ ని వేసి కట్టుకడితే త్వరగా తగ్గుముఖం పడతాయి.కరివేపాకు చెట్టు కి ఉండే కాయలనుంచి రసంతీసి రాస్తే పురుగులు కుట్టినచోట వచ్చే దద్దుర్లు తగ్గిపోతాయి.
  • ఒక బౌల్ లో కొబ్బరినూనెలో కరివేపాకులు వేసి ఆకులు నల్లగా పొడి పొడి అయ్యేవరకు స్టవ్ మీద పెట్టి వేడి చేసి తర్వాత చల్లార్చి పెట్టుకోండి. ప్రతిరోజూ ఈ ఆయిల్ ని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం, నెరవడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
  • కరివేపాకును పచ్చడిగానో… లేక విడిగానో తిన్నా, లేదా దాని రసం మజ్జిగలో కలుపుకుని రోజూ తాగినా అది ఒంటికి చాలా మంచి చేస్తుంది.

Comments

comments

Share this post

scroll to top