షడ్రుచులలో ఒక్కటి అయినా ఉప్పు చేసే ఉప‌కారాలేంటో తెలుసా ??

ఉప్పు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన స్థానం. ఉప్పుని మనం తక్కువగా అంచనా వేయలేము. అది మన ఆరోగ్యానికి ఎంతో అవసరం…అలాగే మితిమీరి వాడితే అనారోగ్యాలనూ తెచ్చిపెడుతుంది. ఉప్పుతో కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను గురించి ఇప్పుడు చెప్పుకుందాం..

# స్నానం చేశాక మెత్తని ఉప్పుతో, గరుకుగా ఉండే శరీర భాగాలు మోచేతులు, మోకాళ్ల వంటి భాగాల్లో తోమటం వలన చర్మంపైని మృతకణాలు పోయి చర్మం మృదు వుగా మారుతుంది.

# ఉప్పుతో కోడి గుడ్లు బాగున్నా యో పాడయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. ఒక కప్పు నీటిలో గుడ్డుని వేసి అందులో రెండు టీ స్పూన్ల ఉప్పుని వేయాలి. గుడ్డు తాజాగా ఉంటే నీళ్లలో మునుగుతుంది. పాడయి ఉంటే తేలుతుంది.

# నల్లబడిన వెండి సామగ్రిని ఉప్పుతో తోమి కడిగి….తుడిచి ఆరనిస్తే కళగా మారతాయి.

# ఐరన్‌బాక్స్‌ అడుగున క్లాత్‌లు అంటుకుని ఏర్పడిన మరకలు ఉంటే …వాటిని ఉప్పుతో పోగొట్ట వచ్చు. బ్రౌన్‌ పేపరుమీద మెత్తని ఉప్పుని వేసి….వేడిగా ఉన్న ఐరన్‌ బాక్స్‌తో దాన్ని ఇస్త్రీ చేసినట్టుగా పామాలి. బాక్స్‌ చల్లారాక క్లాత్‌తో తుడిచేయాలి.

# ఒక వంతు మెత్తని ఉప్పుని రెండు వంతులు బేకింగ్‌ సోడాని కలుపుకుని పళ్లు తోముకుంటే పళ్లు తెల్లగా మెరుస్తాయి. అలాగే ఈ మిశ్రమం పళ్లపై గారని తొలగించి చిగుళ్ల ఆరోగ్యాన్ని పెంచుతుంది.

# ఒకసారి కోశాక యాపిల్‌, బంగాళ దుంపల ముక్కలు నల్లబడి పోతాయి. ఉప్పు కలిపిన చల్లని నీటిలో ఈ ముక్కలను వేసి ఉంచితే అవి నల్లబడకుండా ఉంటాయి.

# ఫ్రిజ్‌ని తుడిచేటప్పుడు ఉప్పు వంటసోడా కలిపిన నీటిని వాడండి. మచ్చలు, జిడ్డు, వాసనలు అన్నీ పోతాయి.

# దోమ కుట్టటం వలన మంటగా ఉంటే…తడిచేసిన ఉప్పుని ఆ ప్రాంతంలో రాసి గట్టిగా తోమాలి.

Comments

comments

Share this post

scroll to top