పిల్ల‌లు త‌ప్పిపోతే ఇలా చేయండి… వెంట‌నే దొరుకుతారు..!

త‌ప్పిపోయిన పిల్ల‌ల‌ను వెద‌క‌డం అంటే ఎంత క‌ష్టసాధ్య‌మైన ప‌నో అంద‌రికీ తెలిసిందే. ఒక ప‌ట్టాన వారు దొర‌క‌రు. ఇంకా చెప్పాలంటే అస‌లు పిల్లలు త‌ప్పిపోతే దొర‌క‌డ‌మ‌నేది చాలా త‌క్కువ సంద‌ర్భాల్లోనే జ‌రుగుతుంది. అందుకు మ‌న దేశంలో ఏటా త‌ప్పిపోతున్న పిల్ల‌ల సంఖ్యే ఉదాహ‌ర‌ణ‌. ఈ క్ర‌మంలో ఎవరైనా త‌మ పిల్లలు త‌ప్పిపోతే ముందుగా పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. అనంతరం క‌ర‌ప‌త్రాల్లో, పేప‌ర్‌, టీవీ ఇలా అన్ని మాధ్య‌మాల్లోనూ ట్రై చేస్తారు. అయినా ఫ‌లితం ఉండ‌దు. దీంతో త‌మ త‌మ పిల్ల‌ల‌కు ఏమైపోయిందోన‌ని వారి కుటుంబీకులు ఎంతో కాలం ఎదురు చూస్తారు. చివ‌రికి పిల్ల‌లు దొరికితే ఓకే, లేదంటే జీవితమంతా బాధ‌ప‌డుతూనే ఉంటారు. అయితే ఇప్పుడ‌లా బాధ ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే త‌ప్పిపోయిన పిల్ల‌ల‌ను వారి ఆధార్ కార్డే మ‌న ద‌గ్గ‌ర‌కు చేరుస్తుంది. అదెలాగంటే…

aadhar-missing-child
ఆధార్ కార్డుల కోసం ఫొటోలు దిగిన‌ప్పుడు మ‌న చేతి వేలి ముద్ర‌ల‌తోపాటు కంటి ఐరిస్ కూడా స్కాన్ చేసి ప్ర‌భుత్వం వారు తీసుకున్నారు క‌దా. అవును, అవే… అవే త‌ప్పిపోయిన పిల్ల‌ల్ని వెదికి పెడ‌తాయి. ఇందుకు ఎవ‌రైనా ఏం చేయాలంటే… త‌మ‌కు ఎవ‌రైనా పిల్లాడు అలా త‌ప్పిపోయి క‌నిపిస్తే వారిని వెంట‌నే స‌మీపంలో ఉన్న ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లాలి. దీంతో ఆ పిల్ల‌ల‌కు చెందిన చేతి వేలి ముద్ర‌లు, ఐరిస్‌ను అక్క‌డి సిబ్బంది స్కాన్ చేసి వారి ఆధార్ కార్డు నంబ‌ర్‌ను ఇట్టే చెప్పేస్తారు. దీంతో ఆ పిల్లాడ్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి అత‌ని ఆధార్ నంబ‌ర్‌ను పోలీసుల‌కు ఇస్తే స‌రిపోతుంది. లేదంటే ముందు పిల్లాడ్ని స్టేష‌న్లో వ‌దిలాక పోలీసులు కూడా ఆధార్ నంబ‌ర్‌ను ముందు చెప్పిన విధంగా తెలుసుకోవ‌చ్చు.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఆధార్ నంబ‌ర్‌లో ఉన్న చిరునామాను సంప్ర‌దిస్తే చాలు. స‌ద‌రు త‌ప్పిపోయిన పిల్లాడికి చెందిన వారు క‌చ్చితంగా దొరుకుతారు. దీంతో వారిని త‌మ సంబంధీకుల‌కు సుల‌భంగా అప్ప‌గించ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఎంద‌రో త‌ప్పిపోయిన పిల్ల‌ల జాడ సుల‌భంగా తెలుసుకునేందుకు వీలు క‌లుగుతుంది. ఒక వేళ ఎవ‌రైనా త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కులు త‌మ త‌మ పిల్లల ఆధార్ నంబ‌ర్లు గ‌న‌క ఇప్ప‌టికీ తీసుకోక‌పోతే వెంట‌నే ఆధార్ నంబ‌ర్ కోసం ఎన్‌రోల్ చేసుకుని దాన్ని పొందే ఏర్పాటు చేసుకోండి. దీంతో ఎవరికైనా పైన చెప్పిన విధంగా సంద‌ర్భాలు ఎదురైతే అప్పుడు ఆ ఆధార్ నంబ‌రే ఉప‌యోగ‌ప‌డుతుంది.

Comments

comments

Share this post

scroll to top