శృంగారానికి ముందు మూత్ర విస‌ర్జ‌న చేయ‌డం మంచిది కాద‌ట‌… ఎందుకో తెలుసుకోండి..!

శృంగార‌మ‌నేది జీవితంలో అతి ముఖ్య‌మైన భాగం. ఇద్ద‌రు దంప‌తుల దాంపత్య జీవితంలో అదే ముఖ్య పాత్ర పోషిస్తుంది. సృష్టిలోకి మ‌రో కొత్త ప్రాణిని తీసుకువ‌చ్చేందుకు ఓ జంట ఒక‌రిపై ఒక‌రు పోరాటం చేసి మ‌రీ సాగించే అస‌లు సిస‌లైన ప్ర‌కృతి కార్యం. అయితే ఈ కార్యం స‌మ‌యంలో దంప‌తులిద్ద‌రూ ఆరోగ్య ప‌రంగా కూడా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌ధానంగా మ‌హిళ‌లు ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే అనారోగ్యాలు సంభ‌వించే అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో శృంగారం జ‌రిగిన అనంతరం తీసుకోవాల్సిన ఓ ముఖ్య‌మైన జాగ్ర‌త్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

srungaram

శృంగారం వ‌ల్ల మ‌హిళ‌ల‌కు మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఎందుకంటే సెక్స్‌లో పాల్గొన్న‌ప్పుడు వారి యోని వ‌ద్ద బాక్టీరియా చేరి అలాగే ఉంటుంద‌ట‌. ర‌తి అనంత‌రం ఆ బాక్టీరియా యోని వ‌ద్ద నుంచి మూత్రాశ‌య ద్వారం వ‌ద్ద‌కు వ‌స్తుంద‌ట‌. ఆ స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా మూత్ర విస‌ర్జ‌న చేయాల్సిందేనంటున్నారు వైద్యులు. లేదంటే ఆ బాక్టీరియా మూత్రాశ‌యం లోప‌లి దాకా వెళ్లి ఇన్‌ఫెక్ష‌న్ల‌ను క‌లిగిస్తుంద‌ట‌.

కాబ‌ట్టి సెక్స్‌లో పాల్గొన్న వెంట‌నే త‌ప్ప‌నిస‌రిగా మూత్ర విస‌ర్జ‌న చేయాల‌ని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా మూత్ర విస‌ర్జ‌న అనంతరం జ‌న‌నావ‌య‌వాల‌ను కూడా శుభ్రం చేసుకోవాల‌ని అంటున్నారు.

urination

కేవ‌లం స్త్రీలే కాదు, పురుషులు కూడా శృంగారం అనంత‌రం మూత్ర విస‌ర్జ‌న చేయాల్సిందేన‌ని వైద్యులు ఢంకా భ‌జాయించి మ‌రీ చెబుతున్నారు. లేదంటే పురుషుల‌కు కూడా ఇన్‌ఫెక్షన్లు వ‌స్తాయ‌ని అంటున్నారు.

అయితే శృంగారానికి ముందు మూత్ర విసర్జ‌న చేయ‌డం మంచిది కాద‌ని మాత్రం వారు సెల‌విస్తున్నారు. ఎందుకంటే ఇది దంప‌తుల ఆరోగ్యంపై చెడు ప్ర‌భావం చూపుతుంద‌ట‌.

మ‌రి శృంగారం మ‌ధ్య‌లో మూత్రం బాగా వ‌స్తే? అప్పుడెలా అంటారా? అప్పుడు మాత్రం ఎక్కువ‌సేపు ఆపుకోకుండా వెంట‌నే మూత్ర విస‌ర్జ‌న చేయాలి. కానీ ర‌తి జ‌రిగాక మ‌ళ్లీ మూత్ర విస‌ర్జ‌న చేయాల్సి ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top