యూరిలో దాడి చేసిన ఉగ్ర‌వాదులు రెండు నెల‌ల ముందే కెమెరాల‌కు చిక్కిన దృశ్యాలు.!

అది 11 జూలై, 2016. జ‌మ్మూ కాశ్మీర్‌లోని హీరాన‌గ‌ర్ సెక్టార్‌. స‌మ‌యం తెల్ల‌వారు ఝామున 3 గంట‌ల‌వుతోంది. భారీగా ఆయుధాలు క‌లిగిన న‌లుగురు వ్య‌క్తులు భార‌త భూభాగంలో సంచ‌రిస్తుండ‌డాన్ని కొంద‌రు బీఎస్ఎఫ్ జ‌వాన్లు చూశారు. రాత్రి పూట కూడా స్ప‌ష్టంగా చూడ‌గ‌లిగే ఇన్‌ఫ్రారెడ్ కెమెరాల స‌హాయంతో స‌ద‌రు వ్య‌క్తుల‌ను భార‌త జ‌వాన్లు గుర్తించారు. అక్క‌డికి సమీపంలోనే పాకిస్థాన్ దేశ స‌రిహ‌ద్దు కూడా ఉంది. ఈ క్ర‌మంలో బీఎస్ఎఫ్ జ‌వాన్లు ఆ స‌రిహ‌ద్దు ప్రాంతానికి వెళ్లి పాకిస్థాన్ రేంజ‌ర్ల‌ను క‌లిశారు. కొంత మంది వ్య‌క్తుల‌ను తాము త‌మ భూభాగంలో చూశామ‌ని, వారు ఎవ‌ర‌ని మ‌న జ‌వాన్లు పాక్ సైనికుల‌ను ప్ర‌శ్నించ‌గా, వారు త‌మ సైనికులే అని, రేంజ‌ర్ అధికారుల‌ని చెప్పి స‌ద‌రు పాక్ జ‌వాన్లు న‌మ్మ‌బ‌లికారు. నిజ‌మేన‌నుకున్న మ‌న జ‌వాన్లు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

అది సెప్టెంబ‌ర్ 18, 2016. భార‌త భూభాగంలో స‌ద‌రు న‌లుగురు వ్య‌క్తులు అడుగు పెట్టాక దాదాపుగా రెండు నెల‌ల‌కు అక్క‌డికి కొంత దూరంలో ఉన్న యూరి సెక్టార్‌లో మన ఆర్మీ బేస్ క్యాంప్‌పై ఉగ్ర‌దాడి జ‌రిగింది. నలుగురు ఉగ్ర‌వాదులు దాడి చేసి 17 మంది భార‌త జ‌వాన్ల‌ను పొట్ట‌న పెట్టుకున్నారు. అనంత‌రం మ‌న ఆర్మీ కాల్పుల్లో వారు కూడా మ‌ర‌ణించారు. ఇదీ జ‌రిగిన అస‌లు విష‌యం.

pak-terrorists
ఇంకేముందీ, అంద‌రికీ తెలిసిపోయింది. పాక్ కుట్ర మొత్తం ప్ర‌పంచానికి వెల్ల‌డైంది. ఆ రోజున భార‌త భూభాగంలో సంచ‌రిస్తున్న స‌ద‌రు న‌లుగురు వ్య‌క్తులే మ‌న ఆర్మీ బేస్‌పై దాడి చేసిన‌ట్టు నూటికి రెండు వంద‌ల పాళ్లు రూఢి అయిపోయింది.

స‌ద‌రు న‌లుగురు వ్య‌క్తుల‌కు పాక్ సైనికులు స‌హాయం చేయ‌డం, వారు మ‌న భూభాగంలోకి న‌క్కి న‌క్కి దొంగ‌ల్లా ప్ర‌వేశించ‌డం, వారి క‌ద‌లిక‌ల‌పై అనుమానం వ‌చ్చి బీఎస్ఎఫ్ అధికారులు వాహ‌నంలో వెళ్లి పాక్ సైనికాధికారుల‌ను ప్ర‌శ్నించ‌డం, వారు తేలుకుట్టిన దొంగల్లా కాద‌న‌డం… అంతా సీక్రెట్‌గా తీసిన కెమెరాల్లో రికార్డ‌యిపోయింది. ఇక పాక్ అడ్డంగా బుక్క‌యిన‌ట్టే. బుకాయించ‌డానికి కూడా వీల్లేనంత కార్న‌ర్‌లో పాక్ ఇరుక్కుపోయింది. స‌ద‌రు కెమెరాల్లో రికార్డ‌యిన వీడియో ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చిందిగా…

ఇప్పుడు చెప్పండి పాకిస్థాన్ బాబులూ… ఏం చెబుతారు మీరు..? ఇంకా ఆ ఉగ్ర‌దాడికీ, మీకూ ఏ సంబంధం లేద‌ని చెబుతారా..? అస‌లు వారు మీకు తెలియ‌ద‌ని అంటారా..?  మీకు తెలియ‌కుండానే వారు అలా ప్ర‌వేశించార‌ని అంటారా..? ఏమంటారు మీరు..?  బాబూ ష‌రీఫూ… ఇన్ని రోజులూ ఉగ్ర‌దాడిపై కాక‌మ్మ క‌బుర్లు చెప్పావే… ఇప్పుడేమంటావు..? అస‌లు అన‌డానికి నీ వ‌ద్ద ఏముంది..?  నీతి, నిజాయితీ, సిగ్గు, మానం… ఏవైనా ఉంటే… అహ‌.. ఉంటే… చేసిన త‌ప్పును ఒప్పుకో… లేకుంటే… నువ్వు ఊహించ‌ని షాక్ ఇచ్చేందుకు భార‌త సైన్యం త‌యారుగా ఉంది.

జ‌మ్మూ కాశ్మీర్‌లోని హీరాన‌గ‌ర్ సెక్టార్‌లోకి ఉగ్ర‌వాదులు ప్ర‌వేశిస్తుండ‌డం, వారికి పాక్ సైనికులు చేతులు క‌లిపి మ‌రీ స‌హాయం చేస్తుండడాన్ని కింది వీడియోలో చూడ‌వ‌చ్చు. అందులో ఉన్న‌ది, యూరి సెక్టార్‌లో దాడి చేసింది… న‌లుగురు ఉగ్ర‌వాదులే. అది కూడా ఈ వీడియోలో గ‌మ‌నించ‌వ‌చ్చు..!

14285765_1228454377177150_1486519637_o

Comments

comments

Share this post

scroll to top