ఉప్పు కిలో 300 కానుందా? ఇందులో వాస్తవమెంత? ఉప్పు రేట్లు పెరగడానికి కారణాలేంటి??

నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైనది ఉప్పు. ఉప్పలేని కూరను ఊహించడమే కష్టం. అలాంటి ఉప్పు రేటు అమాంతం పెరిగిపోయింది, ఇక ఉప్పు దొరకదు అనే వార్తలు వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి! ఆ వార్తల్లో నిజమెంత, నిజంగానే కిలో ఉప్పు కు300/- చెల్లించాలా? దీనిపై పూర్తి సమాచారం తెల్సుకునే ప్రయత్నం చేద్దాం.

వాస్తవానికి ఉప్పు తయారీ ప్రక్రియ నవంబర్-డిసెంబర్ నెలలోనే స్టార్ట్ అవుతుంది. ఉప్పు మడులను చదునుగా చేసి బాగా ఆరబెట్టి యంత్రాల ద్వారా ఉప్పునీటిని మడుల లోకి మల్లిస్తారు. ఎండకు ఆ మడుల లోని నీరు ఆవిరి అయి ఉప్పు స్పటికాలుగా ఎర్పడుతుంది, ఇలా తయారైన ఉప్పును పక్కనే కొంచెం ఎత్తైన ప్రదేశంలో రాసులుగా పోసి, అక్కడి నుండి ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో ఉప్పు ఉత్పత్తి చేయడానికి 40 నుండి 120 రోజులు పడుతుంది. అయితే కొన్ని రోజులుగా వాతావరణం ఒక్కసారిగా ఛేంజ్ అవ్వడం, బలమైన చలిగాలులు వీచడం వల్ల ఉప్పు నీరు గణస్థితిలోకి వచ్చి ఉప్పు గా మారే ప్రక్రియకు కాస్త ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే.! ఇది ఉప్పు ఉత్పత్తిపై ఓ ప్రభావాన్ని చూపుతుంది.

కొన్ని కుటుంబాలు కూడా తమకున్న పొలాల్లో ఉప్పు ఉత్పత్తి చేస్తుంటాయి. కుటుంబ సభ్యులంతా కష్టించి పనిచేస్తే ఎకరానికి 5 లారీల ఉప్పు ఉత్పత్తి చేస్తారు. ఒక లారీ ఉప్పు 5 నుండి 6 వేల ధర పలుకుతుంది. అంటే రోజుకు 200 రుపాయల కూలీ గిట్టుబాటు అవుతుందన్న మాట.! అయితే తాజాగా పాత 500/- 1000/- రూపాయల నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డబ్బు కొరతతో ఉప్పుమడుల నిర్వాహకులు ఉప్పు మడుల్లో పనిచేసే వారికి డబ్బు ఇవ్వలేకపోతున్నారని,దీని కారణంగా అక్కడ పూర్తిగా ఉత్పత్తి తగ్గిపోయిందని, దీని కారణంగా వచ్చే నెలల్లో ఉప్పు ఉత్పత్తే ఉండదనే అర్థంలేని పుకార్లు పుట్టించి దానినే ప్రచారంలో పెట్టారు కొంతమంది. ఆ ప్రచారమే ఆ నోట, ఈ నోట తారాస్థాయిలోకి చేరింది, దాంతో ఇప్పుడు కొందరు కిరాణా షాప్ యజమానులు ఉప్పును బ్లాక్ చేసి, కృతిమ కొరతను సృష్టించి అధిక రేట్లకు అమ్మాలని చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇది జరుగుతుంది.

salt

నిజంగానే ఉప్పుకొరత ఉంటుందా?:
దేశంలో ఉప్పుకొరత ఉండే సమస్యే లేదు….ఎందుకంటే ఉప్పు ఉత్పత్తిలో దేశం ప్రపంచంలోనే 3 వ స్థానంలో ఉంది. ఆంద్రప్రదేశ్ కూడా దేశంలో ఉప్పు ఉత్పత్తిలో 3 వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఉప్పు కనీస ఉత్పత్తి 18.5-19 మిలియన్‌ టన్నుల వరకు ఉంటుంది. ఇందులో తినడానికి సంవత్సరానికి 6.5 మిలి యన్‌ టన్నులు వినియోగిస్తుండగా, పారిశ్రామిక అవ సరాలకు 7.5-8 మిలియన్‌ టన్నులు, ఎగుమతి చేయ డానికి 2-2.5 మిలియన్‌ టన్నులు వినియోగిస్తున్నారు. ఉప్పు కొరత ఎంత ఉన్నా……అవసరమైతే ఎగుమతిని రద్దు చేసైనా నిత్యావసరాలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. పాత నోట్ల రద్దు ఎఫెక్ట్ ఉప్పు ఉత్పత్తిపై రెండు మూడు రోజులకు మించి ఉండదు.
#సో ఫికర్ లేదు… ఉప్పు రేట్లు పెరిగే అవకాశం లేదు.

Comments

comments

Share this post

scroll to top