ప్రతిరోజూ రాత్రి “ఉపాసన” ఓ పేపర్ ని కాల్చివేస్తుంది..! ఎందుకో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరు.!

అపోలో హాస్పటల్స్ గ్రూప్ కి వైస్ చైర్మన్ గా బాద్యతలు నిర్వహిస్తున్న ఉపాసన వేలమందికి బాస్ ..మెగా కోడలిగా అందరి మన్ననలు పొందుతుంది.మొదట్లో చరణ్ కి సరిజోడిగా లేదనే నెగటివ్ టాక్ ఉన్నప్పటికీ తర్వాత తన మంచి మనసుతో మెగా కుటుంబ అభిమానాన్నే కాదు అందరి ఆదరాభిమానాల్ని పొందింది. అపోలో లైఫ్ కి ఎండీ గా అపోలో ఫౌండేషన్ కి వైస్  చైర్ పర్సన్ గా బాధ్యతలు మోస్తున్నప్పటికీ భర్త రామ్ చరణ్ పనులను దగ్గరుండి చూసుకుంటోంది. ఎప్పటికప్పుడు ట్విట్టర్లో అభిమానులకు దగ్గరగా ఉంటుంది..ట్విట్టర్లో ఆమె పోస్టు చేసే విషయాలపట్ల  మెగా అభిమాానులు ఆసక్తి కనపరుస్తుంటారు.ఇటీవల ఆమె చేసిన ఒక పోస్టు అందరిని ఆకట్టుకుంది..అదేంటంటే..పేపర్ థెరపీ..ఏంటా పేపర్ థెరపీ తెలుసుకోండి.

ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా పేపర్ థెరపీ చెప్పి అందరినీ ఆశ్చర్యపరచింది. తనకు ప్రతి రోజూ వచ్చే నెగిటివ్ ఆలోచనలను ఓ పేపర్ పై రాసుకుంటానని చెప్పింది.. ఆ నెగిటివ్ విషయాల లిస్టును ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి చూసుకొని ఆ నెగిటివ్ విషయాల్లో ఏదైనా పరిష్కారం దొరికేది ఉందా అని ఆలోచన చేస్తా… వాటిల్లో పరిష్కారం రాని ఆలోచనలు ఉంటే.. తాను నెగిటివ్ విషయాలను రాసుకొన్న కాగితాన్ని కాల్చి పారేస్తాను అని ఉపాసన చెప్పింది. ఇలా చెయ్యడం వల్ల స్ట్రెస్ నుండి రిలీఫ్ లభిస్తుంది.. సంతోషంగా నిద్రపోతాను అని ఉపాసన చెప్పింది.

అంతేకాదు.. ఈ సింపుల్ టెక్నిక్ ను ఫాలో అయ్యి తమ జీవితాల్లో ఎదురయ్యే నెగిటివ్ ఆలోచనలనుంచి స్ట్రెస్ నుంచి విముక్తి పొందమని ఉపాసనా మెగా అభిమానులకు టిప్స్ ఇస్తుంది. మెగా అభిమానులకు మెగా హీరోలు చేసే సినిమాల అంశాలనే కాదు.. వారిలో వ్యక్త్విత్వ వికాసానికి సంబంధించిన కొత్త విషయాలను..సందర్భం బట్టి వంటలను.. ఈజీ పనులు చేసే టెక్నిక్ ను నేర్పుతూ చైతన్యం తీసుకొస్తుంది అని అంటున్నారు..ఉపాసనా స్ట్రెస్ నుండి రిలీఫ్ అవ్వడానికి కొత్తగా కనిపెట్టిన పేపర్ థెరపీ టాక్ ఆఫ్ ది మీడియాగా మారింది.

Comments

comments

Share this post

scroll to top