“ఉపాసన, నమ్రత” ముద్దాడుతున్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా..? అసలెందుకు ముద్దు పెట్టుకున్నారంటే..!

నమ్రత, ఉపాసన లను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మన తెలుగు వారికి. వీరిద్దరూ స్టార్ హీరోల భార్యలుగా మాత్రమే కాకుండా ఇండివిడ్యువల్ గా గుర్తింపు సాధించుకున్నారు. ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే అప్పుడప్పుడూ పార్టీల్లో సందడి చేస్తుంటారు. స్టార్ అనే ఇమేజ్ చూపించుకోకుండా అందరితో కలివిడిగా ఉంటారు. రీసెంట్ గా వీరిద్దరి మధ్యలో ఓ అమ్మాయి ప్రత్యక్షమైంది. ఉపాసన ఫేస్బుక్ ఖాతాలో ఓ అమ్మాయి ఫోటో పెట్టింది. ఉపాసన, నమ్రత కలిసి ఆ అమ్మాయిని ముద్దాడుతున్నారు. ఆ అమ్మాయి ఎవరా అనే డౌట్ ఆడియన్స్ కి వచ్చింది..! దీంతో ఆమె ఎవరో తెలుసుకోవాలనే ఆరాటం పెరిగింది. ఆమె గురించి ఆరా తీయగా పూర్తి వివరాలు బయటికి వచ్చాయి. ఆమె పేరు దియా భూపాల్.

అఖిల్ తో ఎంగేజ్మెంట్ అయిన జీవీకే మనవరాలు “శ్రియ భూపాల్” గుర్తుందా? పెళ్లి కాన్సల్ కూడా అయ్యింది. శ్రియ భూపాల్ వాడినే ఈ “దియా భూపాల్”. శ్రీయ అన్నయ్య కృష్ణ భూపాల్ ముంబాయ్ కు చెందిన జ్యూయలరీ డిజైనర్ కూతురు ధియా మెహతా ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఆ పిల్లల బర్త్ డే వేడుకకు హాజరైన ఉపాసన, నమ్రత అక్కడ దియాకు ముద్దుపెట్టారంట. శ్రీయ భూపాల్, ఉపాసన మధ్య స్నేహం మాత్రమే కాకుండా దూరపు చుట్టరికం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఇంత క్లోజ్ గా ఉన్నారు.

Comments

comments

Share this post

scroll to top