సిగరెట్లు విడిగా అమ్మితే జైలుకే, కొత్తచట్టం తెచ్చిన UP… దీనిపై నా కౌంటర్.

విడి సిగరెట్లు అమ్మితే ఇక మీదట జైలు పాలుకాక తప్పదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది.  ఈ మేరకు జారీ చేసిన మధ్యంతర ఆర్డినెన్స్పై గవర్నర్ రామ్ నాయక్ ఆమోదముద్ర కూడా వేశారు. ఈ చట్టం ప్రకారం ఏ వ్యక్తయినా విడిగా సిగరెట్లు అమ్మినట్లు సంబంధిత అధికారులు గుర్తిస్తే వారికి వెయ్యి రూపాయల జరిమానాతోపాటు ఒక ఏడాది జైలు శిక్ష అమలు చేస్తారు. ఒకసారి ఈ శిక్షకు గురైన వ్యక్తి మరోసారి అదే నేరానికి పాల్పడి చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ.3 వేల జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది.

ఈ చట్టం తీసుకురాడనికి ప్రభుత్వం చెబుతున్న కారణం

ఎక్కువ పాన్ షాప్ ల దగ్గర విడి సిగరెట్లు కొనడం ,తాగడం లాంటివి చేస్తున్నారు కాబట్టి,  విడిగా అమ్మడాన్ని  నిషేదిస్తే.. పొగతాగే వారు ప్యాకెట్ కొనుక్కోవాల్సి ఉంటది. అంత డబ్బును భరించలేక  ,  సిగరెట్ తాగడం పై అతను నియంత్రణను పాటిస్తాడు.

దీనికి నాలాంటి వాళ్ళు చెప్పే సమాధానం.

  • సిగరెట్ తాగడమే మాన్పించాలనేదే మీ ఉద్దేశ్యం అయితే,  పూర్తిగా  సిగరెట్ నే నిషేదిస్తే ఎవరు కాదన్నారు.
  •  విడిగా వద్దు, ప్యాకెట్ అమ్మండి  అనడం  సిగరెట్ ఉత్పత్తి సంస్థల అమ్మకాలను ప్రోత్సాహించినట్టు కాదా?
  • ఆ నిర్ణయంతో పాన్ షాప్ వాళ్ళ పరిస్థితి ఏంటి?
  • ఒకటి , అర సిగరెట్ తాగే వాళ్ళని కూడా ప్యాకెట్లు ఫ్యాకెట్లు ఊదమనేగా దీని వెనుకున్న అర్థం.
  • జేబులో ప్యాకెట్ సిగరెట్ ఉంటే ..పొగతాగే అలవాటున్నోడు..అది ఖాళీ చేసే దాక ఊరుకుంటాడా…?
  • అయినా బహిరంగ ప్రదేశాల్లో పొగతాగితే నేరం, జరిమానా, జైలు శిక్ష అన్నారు!మరి వాటి విషయంలో  ఏమైనవి మీ చట్టాలు !

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top