పెద‌వుల‌పై మీసాల్లా వ‌చ్చే అవాంఛిత రోమాల‌ను మ‌హిళ‌లు ఇలా సింపుల్‌గా తొల‌గించుకోవ‌చ్చు తెలుసా..?

అందం విష‌యంలో పురుషుల కన్నా మ‌హిళ‌లే ఎంతో శ్ర‌ద్ధ తీసుకుంటార‌న్న విష‌యం తెలిసిందే. అయితే అవాంఛిత రోమాల కార‌ణంగా కొంద‌రు మ‌హిళ‌లు అంద విహీనంగా క‌న‌బ‌డ‌తారు. ముఖ్యంగా పెద‌వుల‌పై మీసాల‌లా వ‌చ్చే వెంట్రుక‌ల‌తో చాలా మంది మ‌హిళ‌లు ఇబ్బందులు ప‌డ‌తారు. వాటిని తొల‌గించుకోవ‌డం కోసం అనేక ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తారు. అయితే కింద ఇచ్చిన టిప్స్ పాటిస్తే అలాంటి వెంట్రుక‌ల‌ను ఎంతో సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు. అంతే కాదు, ముఖం కాంతివంతంగా, అందంగా మారుతుంది కూడా. మ‌రి ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. కొద్దిగా ప‌సుపు, పాలు లేదంటే ప‌సుపు, నీళ్లు క‌లిపి మెత్త‌ని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని వెంట్రుక‌ల‌పై రాయాలి. వెంట్రుక‌లు పెరగ‌డానికి వ్య‌తిరేక దిశ‌లో మిశ్ర‌మాన్ని రాయాలి. ఆ త‌రువాత కొంత సేపు ఆగితే ఆ పేస్ట్ డ్రై అవుతుంది. దాన్ని చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. అనంత‌రం క్రీం లేదా మాయిశ్చ‌రైజ‌ర్ రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అవాంఛిత రోమాలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.

2.కోడిగుడ్డులో ఉండే తెల్ల‌ని సొన‌, కొద్దిగా చ‌క్కెర‌, మొక్క‌జొన్న పిండిల‌ను క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని వెంట్రుక‌లపై అప్లై చేయాలి. 30 నిమిషాలు ఆగాలి. అనంత‌రం నీటితో క‌డిగేయాలి. దీంతో ఆ వెంట్రుక‌లు పోతాయి. అయితే ఇలా వారానికి క‌నీసం 2 సార్లు చేయాలి.

3. పెరుగు, శ‌న‌గ పిండి, ప‌సుపుల‌ను కొద్దిగా తీసుకుని బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని అప్లై చేసి కొంత సేపు అయ్యాక క‌డిగేయాలి. ఇలా చేసినా అవాంఛిత రోమాల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

4. చ‌క్కెర పాకం, నిమ్మ ర‌సం, నీళ్ల‌ను క‌లిపి మిశ్ర‌మంగా త‌యారు చేసుకోవాలి. దీన్ని వాక్స్ స్ట్రిప్స్ స‌హాయంతో వెంట్రుక‌ల‌పై వాక్సింగ్ చేయాలి. ఇలా చేసినా ఆ రోమాలు తొల‌గిపోతాయి.

5. నిమ్మ‌ర‌సం, తేనెల‌ను బాగా క‌లిపి మిశ్ర‌మంగా త‌యారు చేసుకోవాలి. దీన్ని వెంట్రుక‌ల‌పై రాయాలి. 20 నిమిషాలు ఆగాక ఒక శుభ్ర‌మైన గుడ్డ‌ను తీసుకుని దాన్ని వేడి నీటిలో ముంచి తుడ‌వాలి. ఇలా చేస్తే అవాంఛిత రోమాల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

6. ఏవైనా ప‌ప్పు ధాన్యాల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే వాటిని తీసి, ఆలుగ‌డ్డ‌లు, నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి మిశ్ర‌మంగా ప‌ట్టుకోవాలి. దాన్ని వెంట్రుక‌ల‌పై రాయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు .

7. మొక్క‌జొన్న పిండి, పాల‌ను క‌లిపి పేస్ట్‌లా చేసి వెంట్రుక‌ల‌పై రాయాలి. 20 నిమిషాలు ఆగాక క‌డ‌గాలి. వారానికి ఇలా 3 సార్లు చేస్తే చాలు, ఆ వెంట్రుక‌లు పెర‌గ‌వు.

8. బెల్లంతో వాక్సింగ్ చేసుకుంటున్నా అవాంఛిత రోమాల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

9. చామంతి పూల‌తో చేసిన టీ పొడి, చ‌క్కెర ల‌ను పాత్ర‌లోని నీటిలో వేసి మ‌ర‌గించాలి. దీన్ని జెల్‌గా మారే వ‌ర‌కు వేడి చేయాలి. ఆ త‌రువాత చ‌ల్లార్చాలి. దీన్ని వాక్సింగ్‌లా చేసుకుని వాడినా చాలు, అవాంఛిత రోమాలు పోతాయి.

10. గెలాటిన్‌, పాలు, ల‌వంగ నూనెల‌ను క‌లిపి మిశ్ర‌మంగా చేయాలి. దీన్ని వెంట్రుక‌ల‌పై రాయాలి. కొంత సేప‌టికి మాస్క్‌లా ఏర్ప‌డుతుంది. ఆ త‌రువాత దాన్ని తీసేసి నీటితో క‌డ‌గాలి. ఇలా చేస్తే అవాంఛిత రోమాలు వెంట‌నే పోతాయి.

11. ఆలుగ‌డ్డను కోసి ఆ ముక్క‌తో వెంట్రుక‌ల‌పై మ‌సాజ్‌లా రాయాలి. అనంత‌రం ఆ ముక్క‌ను అలాగే రాత్రంతా వ‌దిలేసి ప‌డుకోవాలి. ఉద‌యాన లేవ‌గానే క‌డిగేయాలి. దీంతో అవాంఛిత రోమాలు పోతాయి.

12. ఎర్ర ప‌ప్పు (మైసూర్ ప‌ప్పు)ను పాల‌లో కొంత సేపు నాన బెట్టి ఆ త‌రువాత పేస్ట్ చేయాలి. దీన్ని వెంట్రుక‌ల‌పై రాసి కొంత సేపు అయ్యాక క‌డిగేయాలి. ఇలా చేస్తూ పోతే అవాంఛిత రోమాల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

13. బొప్పాయి పండు గుంజు, అలోవెరా జెల్‌, ప‌సుపుల‌ను క‌లిపి పేస్ట్‌లా చేసి అప్లై చేయాలి. కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేసినా స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

14. కోడిగుడ్డులో ఉండే తెల్ల‌ని సొన‌, ప‌సుపుల‌ను క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దీన్ని వెంట్రుక‌ల‌పై రాయాలి. కొంత సేప‌టికి మాస్క్‌లా ఏర్ప‌డుతుంది. అప్పుడు తీసేయాలి. త‌రువాత నీటితో క‌డ‌గాలి. ఇలా త‌ర‌చూ చేస్తూ ఉంటే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

15. బియ్యం పిండి, పెరుగుల‌ను క‌లిపి మిశ్ర‌మంగా చేసి దాన్ని వెంట్రుక‌ల‌పై రాయాలి. అనంత‌రం కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది.

16. శ‌న‌గ పిండి, నీరు, ప‌సుపుల‌ను క‌లిపి పేస్ట్‌లా చేసి దాన్ని వెంట్రుకల‌పై అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేసినా అవాంఛిత రోమాల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

17. ఓట్ మీల్‌, బ‌నానా రెండు క‌లిపి పేస్ట్‌లా చేసి అందులో కొంత తేనె క‌లిపి వెంట్రుక‌ల‌పై రాయాలి. కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. దీంతో స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

18. శ‌న‌గ‌పిండిలో పాలు లేదా పెరుగు క‌లిపి మిశ్ర‌మంగా చేసి దాన్ని రాసి కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేస్తూ ఉంటే అవాంఛిత రోమాలను తొలగించుకోవ‌చ్చు.

19. గోధుమ పిండి, నీరు, పాలు లేదా పెరుగుల‌ను క‌లిపి పేస్ట్‌లా చేసి వెంట్రుక‌లపై రాయాలి. కొంత సేపు అయ్యాక క‌డిగేయాలి. దీంతో అవాంఛిత రోమాలు పోతాయి.

20. వాక్సింగ్ చేసేట‌ప్పుడు మంచి క్వాలిటీ ఉన్న వాక్స్ స్ట్రిప్స్ వాడ‌డం బెట‌ర్‌. లేదంటే చ‌ర్మం ప‌గులుతుంది.

21. వాక్సింగ్ కూల్ అయ్యాకే అప్లై చేయాలి. లేదంటే వేడిగా ఉన్న‌ప్పుడు అప్లై చేస్తే చ‌ర్మం దెబ్బ తింటుంది.

22. వాక్సింగ్‌తో వెంట్రుక‌ల‌ను తీసేసిన ప్ర‌తి సారి ఐస్ క్యూబ్స్‌, మాయిశ్చ‌రైజ‌ర్‌, యాంటీ సెప్టిక్ క్రీలంను రాస్తే చర్మాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top