“జబర్దస్త్ కిరాక్ RP”ఒకప్పుడు ఏం చేసేవాడో తెలుసా.? ఇప్పుడు వారానికి ఎంత సంపాదిస్తున్నాడు.? షాకింగ్ నిజాలు!

జబర్దస్త్ .. ఒకరిద్దరిని కాదు ఎందరో కమెడియన్స్ ను వెండితెరకు పరిచయం చేసిన షో.సినిమాఛాన్సులు లేక ఇబ్బందిపడుతున్న ఎందరికో దారి చూపిన షో..ప్రోగ్రాం పట్ల కొంత అసహనం ఉన్నప్పటికి ఐదేళ్లుగా నిరాటంకంగా సాగుతున్న  షో..అలాంటి షోలో ఒకటే ఆర్పీ…చూడగానే నవ్వొచ్చే ఫేసు. జోకర్‌ను తలపించే హావభావాలు. స్పాంటేనియస్‌గా పంచ్ లు విసిరే క్రియేటివిటీ. ఈ విలక్షణ లక్షణాలే రాటకొండ ప్రసాద్‌ను జబర్దస్త్‌ ఫేం కిర్రాక్‌ ఆర్పీగా మార్చాయి. సెలబ్రిటీగా నిలబెట్టాయి. ..ఇప్పుడు సెలబ్రిటీలుగా మారిన అందరూ కూడా ఒకప్పుడు చిన్న చిన్న పనులు చేసుకున్నవారే..వారిలో ఒకడే ఈ ఆర్పి..

ఛాన్స్ ఇస్తానన్నా శ్రీహరి..లైఫ్ టర్న్ చేసిన జబర్దస్త్:

నెల్లూరు జిల్లా ఓజిలి మండలం సంగుటూరు కి చెందిన ఆర్పీ బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివాడు.అమ్మ రాటకొండ పద్మ, నాన్న రాటకొండ వెంకటాద్రి. వ్యవసాయ కుటుంబం. చదువు కోసం సెలవుల్లో  కూలిపనికి కూడా వెళ్లేవాడట ఆర్ పి.స్పాంటేనియస్ గా జోకులు వేసి  ఫ్రెండ్స్ ని నవ్వించడం చిన్నప్పటి నుంచే  అలవాటు..దాంతో పాటు సినిమాలంటే పిచ్చి…ఇంట్లో కూర్చుంటే సినిమా ఛాన్సులు దక్కవని అంతా సర్దుకుని హైదరాబాదు వచ్చేసి హోటల్‌లో సప్లయిర్‌గా చేరిపోయాడు.ఇంట్లో చెప్పాపెట్టకుండా వచ్చాడని ఇంటి నుండి డబ్బులు పంపించేవారు కాదు.క్యాటరింగ్ బాయ్ గా కూడా చేశాడు..ఏ పని చేస్తున్నా  పూట గడుస్తున్నప్పటికి సినిమాలపై మక్కువ తగ్గకపోవడంతో ఒక షార్ట్ ఫిలిం తీసాడు ఆర్పి..దానికి శ్రీహరి ప్రశంసలు దక్కి సినిమాల్లో ఛాన్సు ఇస్తా అని మాట ఇచ్చినప్పటికీ..మాట నిలబెట్టుకునే లోపు శ్రీహరి కన్నుమూసారు..ఇంతలో స్క్రిప్ట్ రైటర్ గా ధనరాజ్ ఆర్పీని తీసుకున్నారు..అక్కడే ఆర్పీ లైఫ్ టర్న్ అయింది..

అప్పుడు సర్వర్ ఇప్పుడు టీం లీడర్:

స్క్రిప్ట్ రైటర్ గా వాడుకుంటూ చిన్న చిన్న పాత్రలు ఇచ్చాడు ధనరాజ్..చిన్న పాత్రలనుండి ఇప్పుడు టీం లీడర్ స్థాయికి ఎదిగాడు రాటకొండ ప్రసాద్.ఒకప్పుడు రోజు గడవడం కోసం అన్నపూర్ణ హోటల్‌లో సర్వ్‌ చేసిన ఆర్పీ ఇప్పుడు వారంకు ఏకంగా 15 నుండి 20 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఈయనకు వస్తున్నాయి. సినిమాలో ఉన్న పాత్రను బట్టి ఈయన 5 లక్షల నుండి 20 లక్షల వరకు కూడా పారితోషికాన్ని అందుకుంటున్నాడు.

Comments

comments

Share this post

scroll to top