రెండో ప్ర‌పంచ యుద్ధం గురించిన 22 ఆసక్తికర విషయాలు.!

రెండో ప్రపంచ యుద్ధం… 1939 సెప్టెంబ‌ర్ 1 నుంచి 1945 సెప్టెంబ‌ర్ 2 వ‌ర‌కు జ‌రిగింది. కొన్ని కోట్ల మంది ఆర్మీ సైనికులు, పౌరులు అసువులు బాసిపోయారు. ప్ర‌పంచంలో జ‌రిగిన అత్యంత పెద్ద యుద్ధం కూడా ఇదే. యుద్ధం అనంత‌రం అమెరికా, ర‌ష్యాలు అగ్ర రాజ్యాలుగా రూపొందాయి. ఐక్య రాజ్య స‌మితి ఏర్ప‌డింది. అన్ని దేశాలు శాంతి, స‌హ‌నంతో ముందుకు వెళ్లాల‌ని, యుద్ధం వ‌ద్ద‌ని తీర్మానించి అదే సూత్రాన్ని ఇప్ప‌టికీ పాటిస్తున్నాయి. అయితే రెండో ప్ర‌పంచ యుద్ధంలో జ‌రిగిన ప‌లు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు, విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

world-war-2
1. రెండో ప్ర‌పంచ యుద్ధంలో అమెరికా నావీ త‌ర‌ఫున యుద్ధంలో పాల్గొన్న అత్యంత పిన్న వ‌య‌స్కుల్లో కాల్విన్ గ్రామం ఒక‌డు. అత‌నికి యుద్ధంలో పాల్గొనేనాటికి 12 ఏళ్లేన‌ట‌. కానీ ఆ విష‌యం అత‌నికి అందులో గాయాల‌య్యాక తెలిసింది. అయితే అప్ప‌టికే అత‌ని ప్ర‌తిభకు గాను బ్రాంజ్ స్టార్‌, ప‌ర్పుల్ హార్ట్ బ‌హుమ‌తులు ద‌క్కాయి.

2. జ‌పాన్‌లోని హిరోషిమా, నాగ‌సాకి ప‌ట్ట‌ణాల‌పై అమెరికా రెండు అణుబాంబులు వేసింది క‌దా. అందులో కొన్ని ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు, సైనికులు మృతి చెందారు. అయితే అమెరికా 3వ అణు బాంబును కూడా వేయాల‌నుకుంద‌ట‌. అదీ టోక్యో సిటీపై. జ‌పాన్ రాజ‌ధాని అది. అయితే అప్ప‌టికే జ‌పాన్ లొంగిపోయింది.

3. జ‌ర్మ‌న్ నాజీలు యూదుల‌ను చంపడానికి ముందు వారిని మ‌డ‌గాస్క‌ర్ ద్వీపానికి తీసుకెళ్లార‌ట‌.

4. జర్మ‌నీ రెండో ప్ర‌పంచ యుద్ధంలో ఓడిపోయాక ఆ దేశానికి చెందిన చాలా మంది సైనికులు యుద్ధ ఖైదీలుగా మారలేదు. తమ గుర్తింపును మార్చుకుని శ‌ర‌ణార్థులుగా వేరే దేశానికి వెళ్లారు.

5. ర‌ష్యాలోని క‌ర్స్క్ సాలియెంట్ అనే ప్ర‌దేశంలో ర‌ష్యా, జ‌ర్మ‌నీ దేశాల మ‌ధ్య 1943 జూలై 4 నుంచి 22 వ‌ర‌కు ఫిరంగుల‌తో యుద్ధం చేశారు. అందులో ఉప‌యోగించిన మొత్తం ఫిరంగుల సంఖ్య దాదాపుగా 3600. ప్ర‌పంచంలో ఇదే అత్యంత పెద్ద‌దైన ట్యాంక్ బ్యాటిల్‌గా చ‌రిత్ర‌కారులు పేర్కొంటున్నారు.

6. పోలండ్ దేశానికి చెందిన ల‌క్ష‌లాది చిన్నారుల‌ను జ‌ర్మ‌న్ నాజీలు పొట్ట‌న పెట్టుకున్నారు. అయితే అదృష్ట‌వ‌శాత్తూ 50వేల మంది పోలిష్ పిల్ల‌లు మాత్రం బ‌తికిపోయారు. ఎలా అంటే పోలండ్ పిల్ల‌లు అచ్చం చూసేందుకు కొన్ని యాంగిల్స్‌లో జ‌ర్మ‌న్ పిల్ల‌లుగానే నాజీల‌కు క‌నిపించార‌ట‌. అందుకే వారిని అప‌హ‌రించుకుపోయి త‌మ జ‌ర్మ‌న్ దేశ పౌరుల‌కు ఇచ్చేశారు.

children-world-war-2
7. రెండో ప్ర‌పంచ యుద్ధం జ‌రుగుతున్న స‌మ‌యంలో 1941వ సంవ‌త్స‌రంలో ప్రైవేటు ఉద్యోగులు నెల‌కు 21 డాల‌ర్ల‌ను సంపాదించేవార‌ట‌. అది 1942లో 50 డాల‌ర్ల‌కు పెరిగింది.

8. రెండో ప్ర‌పంచ యుద్ధం కోసం అమెరికా కొన్ని ల‌క్ష‌ల వాహ‌నాల‌ను ముందుగానే త‌యారు చేసింది. అందులో 6.50 ల‌క్ష‌ల జీపులు, 3 ల‌క్ష‌ల ఆర్మీ విమానాలు, 89వేల ఫిరంగులు, 30 ల‌క్ష‌ల మెషిన్ గ‌న్‌లు, 70 ల‌క్ష‌ల రైఫిల్స్‌ను అమెరికా త‌యారు చేసింద‌ట‌.

9. అమెరికాలో హ్యాంబ‌ర్గ‌ర్ అంటే తెలియన వారుండ‌రు. అయితే దాని ఉచ్చార‌ణ జ‌ర్మ‌న్ ప‌దాన్ని పోలి ఉంటుందనే నెపంతో అప్ప‌ట్లో అమెరికా సైనికులు ఆ ఆహార ప‌దార్థాన్ని లిబ‌ర్టీ స్టీక్స్ అని పిలిచేవార‌ట‌.

10. హార్వ‌ర్డ్‌కు చెందిన ఫైట్ సాంగ్‌ను కాపీ కొట్టిన నాజీలు దాన్ని కొంచెం మార్చి త‌మ యుద్ధ గీతంగా పాడుకున్నార‌ట‌. ప్ర‌ధానంగా సైనికులు క‌వాతు చేసేట‌ప్పుడు ఈ సాంగ్‌ను ఎక్కువ‌గా ప్లే చేసే వార‌ట‌.

11. నాజీ పార్టీ నాయ‌కుడు అడాల్ఫ్ హిట్ల‌ర్‌కు మేన‌ల్లుడు ఉండేవాడు. అత‌ని పేరు విలియం హిట్ల‌ర్‌. అయితే అత‌ను రెండో ప్ర‌పంచ యుద్ధంలో అమెరికా నావీ త‌ర‌ఫున ప‌నిచేశాడు. అనంత‌రం త‌న పేరును మార్చుకున్నాడు.

12. ఎయిర్ ఫోర్స్ అనేది రెండో ప్ర‌పంచ యుద్ధంలో ఆయా దేశాల ఆర్మీల్లో ప్ర‌ధాన భాగంగా ఉండేది. కానీ యుద్ధం త‌రువాతే అది ఓ ప్ర‌త్యేక‌మైన విభాగంగా ఏర్ప‌డింది.

13. అమెరికా 1940-45 మ‌ధ్య కాలంలో అంటే రెండో ప్ర‌పంచ యుద్ధం జ‌రిగిన‌ప్పుడు త‌న దేశ డిఫెన్స్ బ‌డ్జెట్‌ను ఏకంగా 1.9 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 59.8 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెంచేసింది.

14. రెండో ప్ర‌పంచ యుద్ధంలో అమెరికా, బ్రిట‌న్ సైనికుల క‌న్నా ర‌ష్యాకు చెందిన సైనికులే ఎక్కువ‌గా మృతి చెందారు.

adolf-hitler
15. యు-బోట్స్ అని పిల‌వ‌బ‌డే ప్ర‌త్యేక‌మైన యుద్ధ నౌక‌లను రెండో ప్ర‌పంచ యుద్ధంలో వాడారు. అయితే ఆ బోట్ల‌లో సేవలందించిన 40వేల మందిలో కేవ‌లం 10వేల మంది మాత్ర‌మే సురక్షితంగా తీరానికి చేరుకున్నారు.

16. ప్ర‌త్య‌ర్థి దేశానికి చెందిన ఆర్మీ విమానాల‌ను రేడియో త‌రంగాల స‌హాయంతో మ‌ట్టుబెట్టే కొత్త ప‌రిక‌రాన్ని బ్రిటిష్ ఇంజినీర్ రాబ‌ర్ట్ వాట్స‌న్ వాట్ ఆ స‌మ‌యంలో క‌నుగొన్నాడు. దానికి డెత్ రే గా నామ‌క‌ర‌ణం చేశాడు. కానీ అదే ఇప్పుడు రేడార్‌గా మారి విమాన‌యాన సంస్థ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతోంది.

17. జ‌ర్మ‌న్ పారామిల‌ట‌రీ ద‌ళం ఎస్ఎస్ యూర‌ప్‌కు చెందిన యూదుల నుంచి త‌స్క‌రించ‌బ‌డ్డ డ‌బ్బు, బంగారం, ఆభ‌ర‌ణాల‌ను మాక్స్ హెయిలిగ‌ర్ పేరిట ఓ క‌ల్పిత పేరుతో ఏర్పాటు చేసిన బ్యాంక్ అకౌంట్‌లో వేసేద‌ట‌.

18. ర‌ష్యాలో 1923 లో జ‌న్మించిన మ‌గ వారిలో 80 శాతం మందికి పైగా పురుషులు కేవ‌లం ఒక్క రెండో ప్ర‌పంచ యుద్ధంలోనే ఎక్కువ‌గా  మ‌ర‌ణించార‌ట‌.

19. ర‌ష్యాకు, ఇత‌ర యూర‌ప్ దేశాల‌కు మ‌ధ్య‌న ఉండే ఈస్ట‌ర్న్ ఫ్రంట్ అనే ప్ర‌దేశంలో జర్మ‌నీ సైనికులు ఎక్కువ‌గా మృతి చెందార‌ట‌. అది ఎంత‌లా అంటే చ‌నిపోయ‌న ప్ర‌తి ఐదుగురు జర్మ‌న్ సైనికుల్లో న‌లుగురు అక్క‌డే మృతి చెందార‌ట‌.

20. రెండో ప్ర‌పంచ యుద్ధంలో చంప‌బ‌డ్డ మొద‌టి జ‌ర్మ‌న్ సైనికున్ని కాల్చింది జ‌పాన్ దేశ ఆర్మీ. అలాగే ఆ యుద్ధంలో చ‌నిపోయిన మొద‌టి అమెరికా సైనికున్ని కాల్చింది ర‌ష్యా ఆర్మీ.

21. రెండో ప్ర‌పంచ యుద్ధంలో బ్రిట‌న్ సైనికులు నిత్యం 3 షీట్ల టాయిలెట్ పేప‌ర్‌ను రేష‌న్ రూపంలో పొందేవార‌ట‌. అదే అమెరికా సైనికుల‌కైతే 22 షీట్ల‌ను ఇచ్చేవార‌ట‌.

22. ఈ యుద్ధంలో మెక్సికోలో ఏర్పాటు చేసిన త‌న స్పై రింగ్‌తో జపాన్ శ‌త్రు సేన‌ల‌ను గురించిన స‌మాచారాన్ని తెలుసుకునేద‌ట‌.

Comments

comments

Share this post

scroll to top