అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్టు డాషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించారు. తన బర్త్ డే రోజే తనకిష్టమైన ఆటకు వీడ్కోలు పలికారు వీరేంద్ర సెహ్వాగ్. నజఫ్ గఢ్ నవాబ్, ముల్తాన్ సుల్తాన్ అని మీడియా అతనిని ముద్దుగా పిలుచుకుంటుంది. అయితే గతంలో సెహ్వాగ్ గురించి సచిన్, గంగూళీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చాయ్.
బ్యాటింగ్ చేస్తున్న సెహ్వాగ్ దగ్గరికి వెళ్ళి సచిన్ సెహ్వాగ్ తో నిన్ను కొడతా అన్నాడట!( ఇది సచిన్ కథనం).
అసలు సెహ్వాగ్ ను కొట్టాలన్నంత కోపం మీకెందుకొచ్చిందండీ అంటే దానికి సచిన్ ఇచ్చిన సమాధానం ఎంటో తెలుసా…? సెహ్వాగ్ నేనూ ఓపెనర్స్ గా దిగాం. దిగినప్పటి నుండి సెహ్వాగ్ సిక్సులు, ఫోర్లతో వీరబాధుడు బాదుతున్నాడు. దాని కోసం చాలా రిస్కీ షాట్స్ ఆడుతున్నడు. ఆ భారీ షాట్స్ కొట్టే ప్రయత్నంలో ఎక్కడ అవుట్ అవుతాడేమోనని.. రిస్కీ షాట్స్ ఆడకు అని అతనితో చెప్పాను. మూడు బంతులు మామూళుగా ఆడి మళ్లీ దంచుడు స్టార్ట్ చేశాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి నీవు ఆ బాదుడు ఆపకపోతే, నేను నిన్ను బాదాల్సి వస్తుందని అన్నాను, దానికి సెహ్వాగ్ నవ్వుతూ ఓకే సార్ అన్నాడు.. అదే మ్యాచ్ లో సెహ్వాగ్ తొలి ట్రిపుల్ సెంచరీ చేశాడు. ( ఇది సచిన్ కథనం).
దాదా దీనికి నా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది అన్నాడు..చెప్పినట్టే చేశాడు ( ఇది గంగూలీ కధనం).
అబ్దుల్ రజాక్ బౌలింగ్ చేస్తున్నాడు, బాల్ బాగా స్వింగ్ అవుతుంది. అసలు ఎటుపడి ఎటు వస్తుందో కూడా అర్ధం అవ్వట్లేదు. అప్పుడు నేనూ సెహ్వాగ్ ఇద్దరం క్రీజ్ లో ఉన్నాం. ఓవర్ అయ్యాక ఇద్దరం దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఏం చేద్దాం అని నేను అన్నా. అప్పుడు దీనికి నా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది చూడు చూపిస్తా అన్నాడు సెహ్వాగ్. నెక్ట్ ఓవర్ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ బాల్ వేశాడు బౌలర్ అప్పుడు సెహ్వాగ్ లాగి ఒక్కటిచ్చాడు, దెబ్బకు బంతి గ్రౌండ్ అవతల పడింది. ఆ బాల్ బదులు కొత్త బాల్ వచ్చింది. స్వింగ్ బాధ తప్పింది.
అది ఆయన స్టైల్ ( కుంబ్లే కథనం).
అందరూ క్రీజ్ లో కుదురుకున్నాక సిక్స్ లు కొడతారు, కానీ సెహ్వాగ్ సిక్స్ కొట్టాక క్రీజ్ లో కుదురుకుంటాడు.
రిటైర్మెంట్ తర్వాత సెహ్వాగ్ మాటలు: ( Video):