హ‌నుమంతుడు ఇప్ప‌టికీ ఉన్నాడా..? మ‌ంటల్లో క‌నిపించిందెవ‌రు..?

హ‌నుమంతుడికి మ‌ర‌ణం లేద‌ని, ఆయ‌న క‌లియుగం అంతం అయ్యే వ‌ర‌కు జీవించే ఉంటాడ‌ని మ‌నం ఇది వ‌ర‌కే రామాయ‌ణంలో చ‌దువుకున్నాం క‌దా. అయితే హ‌నుమంతుడు నిజంగానే ఇంకా బ‌తికే ఉన్నాడ‌ని, ఆయ‌న ఈ భూమిపై ఇప్ప‌టికీ ఎక్కడో ఒక చోట క‌నిపిస్తూనే ఉంటాడ‌ని కూడా ఇది వ‌ర‌కు వ‌చ్చిన ప‌లు క‌థ‌నాల ద్వారా తెలుసుకున్నాం. కొంద‌రైతే హ‌నుమంతుడు ఇప్ప‌టికీ ఉన్నాడంటూ ప‌లు ఫొటోల‌ను అందుకు నిద‌ర్శ‌నంగా చూపించారు కూడా. అయితే ఇలాంటిదే ఓ వార్త ఇప్పుడు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. అయితే అది మ‌న దేశంలో కాదు, శ్రీ‌లంక‌లో..!

lord-hanuma-photo-1

శ్రీ‌లంక‌లో హ‌ను మండ‌ల్ అనే ఓ ప్రాంతంలో భ‌క్తులు హ‌నుమ‌కు చ‌ర‌ణ పూజ‌, సాక్ష‌త్ హ‌నుమాన్ పూజ చేస్తారు. అయితే అలాంటి పూజ‌లో పాల్గొన్న ఓ భ‌క్తుడు అనుకోకుండా య‌జ్ఞం నుంచి వ‌చ్చిన మంట‌ను ఫొటో తీశాడ‌ట‌. అందులో హ‌నుమంతుడి ఆకారాన్ని పోలిన మంట క‌నిపించింద‌ట‌. చిత్రంలో చూశారుగా..! అదే మంట ఆంజ‌నేయ స్వామి ఆకారంలో ఉన్న‌ట్టు గుర్తించి అత‌ను దాన్ని నెట్‌లో షేర్ చేయ‌డంతో ఇప్పుడా ఫోటో నెట్‌లో వైర‌ల్‌గా ట్రెండ్ అవుతోంది. అయితే నిజంగా ఆంజ‌నేయ స్వామే ఆ య‌జ్ఞం వ‌ద్ద‌కు వ‌చ్చాడ‌ని స‌ద‌రు హను మండ‌ల్ ప్రాంతంలో నివాసం ఉండే మాతంగ్ అనే గిరిజ‌నులు కూడా చెబుతున్నారు. వారి వ‌ద్ద‌కు 41 ఏళ్ల‌కు ఒక‌సారి హ‌నుమ వ‌స్తాడ‌ని, అందులో భాగంగానే ఈ మ‌ధ్య నిర్వ‌హించిన యాగానికి కూడా హ‌నుమంతుడు వ‌చ్చాడ‌ని వారు చెబుతున్నారు.

hanuma-foot-prints

hanuma-foot-prints-1

అయితే పైన చెప్పిందే కాదు, హ‌నుమంతుడు నిజంగా ఉన్నాడ‌ని చెప్ప‌డానికి సాక్ష్యాలుగా ప‌లు ప్రాంతాలు కూడా నిలుస్తున్నాయి. అవేమిటంటే… సీత కోసం హ‌నుమంతుడు లంక‌కు మొద‌టిసారిగా వెళ్లిన‌ప్పుడు కాలు పెట్టిన ప్ర‌దేశంగా శ్రీ‌లంకలో ఓ ప్రాంతం ఉంద‌ట. అక్క‌డ హ‌నుమంతుడి భారీ పాద ముద్ర ఉంది. దాన్నే అందుకు సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఈ క్రమంలో అలాంటివే పాద ముద్ర‌లు మ‌లేషియాలోనూ ఉన్నాయ‌ని ప‌లువురు గుర్తించారు. అవి కూడా హ‌నుమ‌వే అని అంద‌రూ భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ప‌డిన ముద్ర‌లు సీత‌వి అయి ఉండ‌వ‌చ్చ‌ని కూడా ఓ వాద‌న విన‌బ‌డుతోంది. రావ‌ణుడు సీత‌ను ఎత్తుకు వెళ్లేట‌ప్పుడు జ‌టాయువు ఈ ప్రాంతంలో ప‌డిపోయి మ‌ర‌ణించాడ‌ని కూడా ప‌లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇక కింద ఇచ్చిన చిత్రంలో చూడండి… ఈ ఫొటో ఒక‌ప్పుడు బాగా ప్ర‌చార‌మైంది. హ‌నుమంతుడు హిమాయాల్లో ఉన్న‌ప్పుడు ఓ వ్య‌క్తి తీసిన అస‌లు ఫొటో అని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అయితే నిజానికి హ‌నుమంతుడు ద‌క్షిణ భార‌త దేశంలో ఉన్న పంబ‌న్ అనే ద్వీపంలోని గంధ‌మ‌ద‌న్ అనే ప‌ర్వతంపై ఇప్ప‌టికీ జీవించి ఉన్నాడ‌ని కొంద‌రు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఆంజ‌నేయ స్వామి మాత్రం చిరంజీవియే అని, ఆయ‌న‌కు మ‌ర‌ణం లేద‌ని రామాయ‌ణం చెబుతోంది..!

hanuma-real-photo

Comments

comments

Share this post

scroll to top