ఎదుటివారికి ఏదైనా విషయం చెప్పదలుచుకున్నప్పుడు దానికి చాలా మార్గాలుంటాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. అదే వారిలోని కళాత్మకతను బయటపెడుతుంది. మహిళలపై పెరుగుతున్న అరాచకాలు, వారిపట్ల ప్రవర్తిస్తున్న తీరును విమర్శిస్తూ జోర్డాన్ హాంజ్ అనే 24ఏళ్ల యువతి వినూతన రీతిలో తన నిరసన తెలియజేసింది. రంగుల జీవితంలో మహిళ ఎదుర్కొంటున్న అకృత్యాలు, అరాచకాలను అదే రంగులతో కొన్ని గంటలపాటు శ్రమించి తన శరీరంపై రంగురంగుల బొమ్మలతో, గీతలతో తను చెప్పాలనుకున్నది చిత్రించింది. ఇదంతా వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేసింది. సమాజంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నిస్తే ఆమెను తిరుగుబోతుగా, పొగరుబోతుగా ఈ సమాజం ముద్ర వేస్తున్నదని ఆమె విచారం వ్యక్తం చేస్తున్నది. ఆమె ఇచ్చిన సందేశాత్మక వీడియో మీరే చూడండి.