అంపైర్ల తప్పిదం.. ఓవర్‌లో 7 బంతులు.! నిన్నటి హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్ లో వింత..!

ఐపీఎల్ 2018 సీజన్‌లో అంపైర్ల తప్పిదాలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. ఓ ఓవర్‌లో 7 బంతులు వేయించారు. ఈ విషయాన్ని క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బహిర్గతం చేశారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన లాలిన్‌‌.. ఫీల్డ్ అంపైర్ల తప్పిదం కారణంగా ఏడు బంతులు వేయాల్సి వచ్చింది. ఏడో బంతికి ధావన్ ఒక పరుగు రాబట్టాడు. అయితే.. అప్పటికే 126 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్ 103/1తో గెలుపు దిశగా సాగుతుండటంతో.. మ్యాచ్‌పై ఈ బంతి ప్రభావం పడలేదు. కానీ.. చివరి ఓవర్‌లో ఫలితం తేలే మ్యాచ్‌లకి పెట్టిందిపేరైన ఐపీఎల్‌ ఇలాంటి తప్పిదాలు కచ్చితంగా ప్రభావం చూపేవే..!

Comments

comments

Share this post

scroll to top