ఆ అంపైర్ చేతికి ధ‌రించిన ప‌రిక‌రం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

క్రికెట్ ఆట‌లో ఆట ఆడే ప్ర‌తి ప్లేయ‌ర్‌కు ర‌క్ష‌ణ కోసం ప‌రిక‌రాలు ఉంటాయి. చేతుల‌కు గ్లౌజులు, త‌ల‌కు హెల్మెట్‌, కాళ్ల‌కు ప్యాడ్స్‌.. ఇలా అనేక భాగాలకు ర‌క్ష‌ణ‌గా ప‌లు వ‌స్తువులు క్రికెట్ ఆట‌గాళ్ల‌కు ఉంటాయి. మ‌రి అంపైర్‌కో..? అంటే.. అందుకు లేద‌నే స‌మాధానం వస్తుంది. కానీ నిజానికి క్రికెట్‌లో అంపైర్‌కు కూడా ర‌క్ష‌ణగా ఏదైనా ప‌రిక‌రం ఉండాల్సిందే. బ్యాటింగ్ చేసే ప్లేయ‌ర్స్‌ ఎదురుగా నిల‌బ‌డి ఉంటారు క‌నుక వారు కొట్టే షాట్ల నుంచి త‌ప్పించుకోవాలంటే అంపైర్ల‌కు కూడా ర‌క్ష‌ణ‌గా ప‌రిక‌రాలు ఉండాలి. కానీ ఇప్పటి వ‌ర‌కు అలాంటి ప‌రిక‌రాల‌ను ఎవ‌రూ త‌యారు చేయ‌లేదు. క‌నీసం ఐసీసీ కూడా ఈ విష‌యాన్ని అంత‌గా ఆలోచించ‌లేదు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన అంపైర్‌ బ్రూస్‌ అక్సెన్‌ ఫోర్డ్ మాత్రం ఈ దిశ‌గా ఓ వినూత్న ఆలోచ‌న చేశాడు. అదేమిటంటే…

ఆస్ట్రేలియాకు చెందిన అంపైర్‌ బ్రూస్ ఆక్సెన్‌ ఫోర్డ్ ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ మ్యాచుల్లో చేతికి ఒక ప‌రిక‌రాన్ని పెట్టుకుని క‌నిపించాడు తెలుసు క‌దా. అత‌ను దాన్ని 2017 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో, న్యూజిలాండ్‌, భారత్‌ వన్డే సిరీస్‌ (2016)లోనూ ఈ పరికరాన్ని ధరించాడు. అయితే దీన్ని ఐసీసీ త‌యారు చేయ‌లేదు. ఆక్సెన్‌ఫోర్డ్ స్వ‌యంగా త‌న‌కు తానే ఈ ప‌రిక‌రాన్ని త‌యారు చేసుకున్నాడు. దీన్ని ప్లాస్టిక్, పాలీ కార్బొనేట్ అనే ప‌దార్థాల‌తో 6 మిల్లీ మీట‌ర్ల మందంతో త‌యారు చేశాడ‌ట‌. దీన్ని చేతికి ధ‌రిస్తే బాల్ వ‌చ్చిన‌ప్పుడు వేగంగా దీన్ని బాల్‌కు అడ్డుపెట్టి గాయాల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

ప్ర‌స్తుతం ఐపీఎల్ మ్యాచ్‌ల‌లో అంపైరింగ్ చేస్తున్న ఆక్సెన్‌ఫోర్డ్ ఈ ప‌రిక‌రాన్ని ధ‌రిస్తున్నాడు. దీంతో అత‌ను ధ‌రిస్తున్న ఈ ప‌రిక‌రంపై అంద‌రి దృష్టి ప‌డింది. అయితే ఇక్క‌డే మీకు ఒక సందేహం వ‌చ్చి ఉండ‌వ‌చ్చు. అదేమిటంటే.. బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి అంపైర్ ధ‌రించిన ఈ ప‌రిక‌రానికి తాకి గాల్లోకి లేచాక దాన్ని ఫీల్డింగ్ చేస్తున్న వారు క్యాచ్ ప‌డితే ఔటిస్తారా..? అంటే.. అవును ఔటిస్తారు. ఈ మేర‌కు ఐసీసీ రూల్స్ క్లియ‌ర్‌గా ఉన్నాయి కూడా. అయితే అంపైర్ ఆక్సెన్ ఫోర్డ్ గ‌తంలో హెల్మెట్ కూడా ధ‌రించాడ‌ట‌. క్రికెట్ మ్యాచ్‌ల‌లో తొలిసారిగా హెల్మెట్ ధ‌రించిన అంపైర్ కూడా ఇత‌నేన‌ని రికార్డుల్లో ఉంది. ఏది ఏమైనా.. ప్లేయ‌ర్స్‌తోపాటు అంపైర్ల‌కు కూడా ర‌క్ష‌ణ క‌ల్పించాలి. లేదంటే వేగంగా వ‌చ్చే బంతుల నుంచి వారికి ప్రాణ‌హాని ఉంటుంది..!

 

Comments

comments

Share this post

scroll to top