ఇప్పుడతను “ఇండియా” టీం లో టాప్ బౌలర్..! కానీ ఒకప్పుడు బొగ్గు గ‌నిలో ప‌నిచేశాడు..! అంతేకాకుండా..!

ఉమేష్ యాద‌వ్‌. భార‌త క్రికెట్ టీంలో ఇప్పుడిత‌ను చాలా కీల‌క ఆట‌గాడు. వ‌న్డే, టెస్ట్‌, టీ20 లేదా ఐపీఎల్.. ఇలా ఏ మ్యాచ్ ఏదైనా ఉమేష్ ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌లో వ‌ణుకు పుట్టిస్తాడు. అదీ.. త‌న ఫాస్ట్ బౌలింగ్‌తో. అయితే ఇంత‌టి ముఖ్య‌మైన ఆట‌గాడిగా ఎదిగేందుకు మాత్రం ఉమేష్ చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ఒకానొక ద‌శ‌లో చ‌దువు మానేసి తండ్రితోపాటు వెళ్లి ప‌నిచేయాల్సి వచ్చింది. అయితేనేం… క‌ష్ట‌ప‌డ్డాడు. కనుక ఫ‌లితం ల‌భించింది. దీంతో క్రికెట్ ప్లేయ‌ర్‌గా ఒక్క‌సారిగా అత‌ని ద‌శ తిరిగిపోయింది.

ఉమేష్ యాద‌వ్ పుట్టింది 1987లో నాగ్‌పూర్‌లో. అతని కుటుంబంలో అత‌నే చిన్న‌వాడు. అత‌ని తండ్రి నాగ్‌పూర్‌కు ద‌గ్గ‌ర్లో ఓ గ్రామంలో ఉన్న బొగ్గు గ‌నిలో ప‌నిచేసేవాడు. అయితే అత‌నికి వ‌చ్చే జీతం అంతంత మాత్ర‌మే. దీంతో కుటుంబం గ‌డ‌వ‌డ‌మే చాలా క‌ష్టంగా ఉండేది. ఈ క్రమంలో ఓ ద‌శ‌లో ఉమేష్ యాద‌వ్ చ‌దువు మానేసి తండ్రితోపాటు బొగ్గు గ‌నిలో ప‌నిచేసేవాడు. అయితే చ‌దువు మానేసినా ఉమేష్ మాత్రం క్రికెట్ అంటే ఇష్టం ఉండ‌డం చేత ఓ వైపు బొగ్గు గ‌నిలో ప‌నిచేస్తూనే మ‌రో వైపు క్రికెట్ కోచింగ్ తీసుకునేవాడు. ఈ క్ర‌మంలో క్రికెట్‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తుండ‌డంతో అత‌ను ఇక క్రికెట్‌నే త‌న కెరీర్‌గా మ‌లుచుకున్నాడు.

కాగా 2008వ సంవ‌త్స‌రం ఉమేష్ క్రికెట్ కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. ఆ సంవ‌త్స‌రం జ‌రిగిన రంజీ ట్రోఫీకి గాను అత‌ను సెలెక్ట్ అయ్యాడు. అత‌ను తాను ఆడిన మొద‌టి మ్యాచ్‌లోనే 75 ప‌రుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు తీశాడు. దీంతో అత‌ను ఇక వెను దిరిగి చూడ‌లేదు. అలా ఎన్నో టోర్న‌మెంట్స్ ఆడాడు. ఈ క్ర‌మంలోనే 2010లో ఐపీఎల్‌లో ఢిల్లీ జ‌ట్టు త‌ర‌ఫున ఆడే అవ‌కాశం ల‌భించింది. అప్పుడు ఆ జ‌ట్టు ఉమేష్‌ను రూ.18 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. ఆ త‌రువాత ఇక ఉమేష్ జీవితం కీల‌క మ‌లుపు తిరిగింది. ఐపీఎల్‌లో రాణించ‌డంతో భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. అలా 2011లో భార‌త్ త‌ర‌ఫున త‌న మొద‌టి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలోనే తాన్యా అనే యువ‌తిని 2013లో వివాహం చేసుకున్నాడు.

అయితే ఇప్ప‌టికీ ఉమేష్ త‌న కుటుంబ స‌భ్యుల‌తోనే ఉంటాడు. కానీ అత‌ను ఉండేది చాలా ఖ‌రీదైన బంగ‌ళా. కాగా ఇప్పటి వ‌ర‌కు భార‌త జ‌ట్టుకు ఆడిన ఫాస్ట్ బౌల‌ర్ల‌లో ఉమేష్ యాద‌వ్ బౌలింగ్ స్పీడే అత్య‌ధికం. అత‌ను గంట‌కు 152.3 కిలోమీట‌ర్ల వేగంతో బంతులు వేస్తాడు. ఏది ఏమైనా పేద కుటుంబంలో పుట్టి అలా క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన ఉమేష్ జీవితాన్ని అంద‌రూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే. ప్ర‌స్తుతం అత‌ను ఈ మ‌ధ్యే అక్టోబ‌ర్ 25వ తేదీన త‌న 30వ బ‌ర్త్ డేను జ‌రుపుకున్నాడు.

Comments

comments

Share this post

scroll to top