నీ టాలెంట్ కు సలామ్… తమ్ముడు.

ఓ వైపు మ్యూజిక్ సరంజామా.. మరోవైపు ప్రొఫేషనల్ సింగర్స్, ఇంకోవైపు రీరికార్డింగ్  సిస్టమ్ ఇదంతా పక్కాగా ప్లాన్ ప్రకారం చేస్తే ఓ పాట మనముందు కనిపిస్తుంది, వినిపిస్తోంది. పాట స్టాయిని బట్టి అది పదిరోజుల  పాటా లేక, ఏఆర్ రెహమాన్, కీరవాణి, ఇళయరాజాలు కంపోజ్ చేసిన పాట లాగా సదా గుర్తుండే పాటనా  తేలిపోతోంది.

మరి ఇవేవీ లేకుండా ..తెలుగు ప్రజలను భక్తి పారవశ్యంతో ఓ ఊపు ఊపేసిన అది.. ఓం నమో శివరుద్రయా అంటూ…. ఖలేజా సినిమాలోని రోమాలను నిక్కపొడిపించిన పాట అది.

మరి ఆ పాటను, ఎటువంటి మ్యూజిక్ ఈక్విప్మెంట్ లేకుండా….అది కూడా అంధత్వం ఉన్న చిన్నోడు పాడితే అదికూడా ఒరిజినల్ సాంగ్ కు ఏ మాత్రం తేడా లేకుండా యాస్ ఇట్ ఈస్ పాడితే..  

అదుర్స్ కదూ, అదే ప్రత్నం చేశాడీ కుర్రాడు. అతనే పాడాడు, మ్యూజిక్ కూడా అతడే తన చేతులతో ఇచ్చాడు… అతడి ప్రతిభ చూసి మేమైతే చేతులెత్తి సలాం కొడుతున్నాం.. మీరూ అతని ప్రతిభ చూడండి. కండ్లు లేని ఆ కుర్రాడు తన సంగీత ప్రపంచంలో మనకుదగ్గరుండి మరీ సప్తస్వర్ణాల లోకంలోకి తీసుకెళ్లాడు.

Watch Video Below, wait for 3 seconds for the video to Load:

my friend blind man padina song

Posted by Jakee Dancer on Tuesday, July 14, 2015

తట్టిలేపాలే కానీ  అంకవైకల్యం గల వారి లో అంతులేని ప్రతిభ దాగుంది. అప్పుడప్పుడు కొన్ని మాత్రమే ఇలా బయట పడుతుంటాయి. ఏదేమైనా ఇంతటి అపార ప్రతిభ గల  ఆల్ ఇన్ వన్ టాలెంట్ గల చిన్నోడికి హ్యాట్సాప్.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top