3 గంటలకు బాస్ ఫ్లైట్ ఎక్కుతున్నాడని..ఆ ఉద్యోగి ఏం చేసాడో చూస్తే నవ్వాపుకోలేరు..!

ఇటీవ‌లే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్వాకం మ‌నం చూశాం క‌దా. రాజీవ్ క‌తియాల్ అనే వ్య‌క్తిని బ‌స్సు ఎక్క‌నీయ‌కుండా అడ్డుకోవ‌డ‌మే కాదు. అత‌ని ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. ఆ క్ర‌మంలో అత‌న్ని ఆ విమాన సంస్థ సిబ్బంది కింద ప‌డేసి కొట్టారు కూడా. దీంతో ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్ అయింది. అయితే ఈ ఘ‌ట‌నలో ఇండిగో ఎయిర్‌లైన్స్ తాజాగా రాజీవ్ క‌తియాల్‌కు క్ష‌మాప‌ణ చెప్పింది కూడా. అయితే ఇప్పుడా ఘ‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో ఓ వ్య‌క్తి వేసిన జోక్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అత‌ను వేసిన జోక్ ఏమిటో తెలుసా..?

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రాజీవ్ క‌తియాల్ అనే వ్య‌క్తిని ఇండిగో సిబ్బంది కొట్టారు క‌దా. దీనిపైనే ఓ వ్య‌క్తి ఇప్పుడు ట్విట్ట‌ర్ లో జోక్ వేశాడు. అదేమిటంటే… తాను ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో ప్ర‌యాణించాల‌ని అనుకుంటున్నాన‌ని, త‌న‌కు హెల్ప్ చేయ‌మ‌ని రోహిత్ అనే వ్య‌క్తి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఇండిగో సంస్థ‌కు ట్వీట్ పెట్టాడు. దీంతో ఇండిగో సంస్థ స్పందించింది. తాము ఏవిధంగా స‌హాయ ప‌డ‌గ‌ల‌మ‌ని రోహిత్‌ను వారు ట్విట్ట‌ర్‌లో అడ‌గ్గా… అప్పుడు రోహిత్ స్పందిస్తూ…

త‌న బాస్ ఫ్లైట్‌లో ముంబై నుంచి ఢిల్లీ వ‌స్తున్నాడ‌ని, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అత‌ను దిగ‌గానే వెంట‌నే అత‌న్ని బ‌య‌ట‌కు ఈడ్చి కొట్టాల‌ని అత‌ను ట్వీట్ చేశాడు. దీంతో రోహిత్ ట్వీట్‌కు గాను ఇండిగో సంస్థ‌కు ఏం స‌మాధానం చెప్పాలో అర్థం కాలేదు. కాగా రోహిత్ తాను చేసిన ట్వీట్ల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా ఇప్పుడ‌వి పెద్ద జోక్‌గా వైర‌ల్ అవుతున్నాయి. దీంతో అనేక మంది నెటిజ‌న్లు ఆ ట్వీట్ జోక్‌కు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. డూడ్ నువ్వు నిజంగా మంచి ప‌ని చేశావ్ అని కొంద‌రు కామెంట్లు పెడుతుంటే.. భాయ్‌, నీకు ఈ కేట‌గిరిలో జ్యూరీ అవార్డు ఇప్పిస్తా.. అని కొంద‌రు అంటున్నారు. ఏది ఏమైనా ఇండిగో సంస్థ‌కు రోహిత్ వేసిన కౌంట‌ర్ అదిరింది క‌దా..!

 

Comments

comments

Share this post

scroll to top