ఉదయం పెళ్లి అయ్యింది.. సాయంత్రం పెళ్లి కూతురు తల్లి అయ్యింది! పెళ్లి కొడుకు షాక్ అవ్వకుండా సంతోషపడ్డాడు.!

యువ‌తీ యువ‌కులు ప్రేమించుకోవ‌డం, పెళ్లి కాకుండానే శారీర‌కంగా ఇద్ద‌రూ ఒక్క‌ట‌వ్వ‌డం, ఆ త‌రువాత బాబుకో, పాప‌కో యువ‌తి జ‌న్మ‌నివ్వ‌డం.. ఇదంతా నేటి త‌రుణంలో స‌హ‌జమే. ఈ క్ర‌మంలో ఆ యువ‌తి యువ‌కుడు ఓకే అనుకుంటే పెళ్లి చేసుకుంటారు, లేదంటే లేదు. స‌హ‌జంగా జ‌రిగే విష‌య‌మే. అయితే ఆ ప్రాంతంలో మాత్రం చాలా చిత్ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వింటే షాక‌వుతారు. అవును, క‌రెక్టే. ఎందుకంటే విష‌యం అలాంటిది మరి. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

అది ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలో ఉన్న జ‌ర్గావ్ గ్రామం. అక్క‌డ నివాసం ఉండే ఓ వ్య‌క్తి అదే ప్రాంతానికి చెందిన ఓ యువ‌తిని ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన‌ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్ల‌య్యాక వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ ప‌క్క‌నే ఉన్న స‌ఖం ముస‌ల్మ‌న‌న్ అనే గ్రామంలోని ఓ ఇంటికి విచ్చేశారు. ఇంకా అక్క‌డ వారికి జ‌ర‌గాల్సిన కార్య‌క్ర‌మాలు కొన్ని ఉన్నాయి. అయితే అంత‌లోనే వ‌ధువుకు ఒంట్లో అసౌక‌ర్యంగా అనిపించింది. క‌డుపులో తీవ్ర‌మైన నొప్పి వ‌చ్చింది. దీంతో ఆమెను హాస్పిట‌ల్‌లో చేర్పించ‌గా, ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది.  పెళ్లి కొడుకు ఆ బిడ్డను చూసుకుంటూ తెగ మురిసిపోయాడు.

మిగతావారికి కథ అర్థం కాలేదు. ఉదయం పెళ్లి అయ్యింది. సాయంత్రం ఇలా పెళ్లి కొడుకు తండ్రి అయ్యాడు. అందులో పెళ్లి కొడుకు తెగ ఆనందపడిపోతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ అసలు కథ తెలిస్తే పెళ్లి కొడుకు సంతోషపడడంతో తప్పులేదని అనిపిస్తుంది. వీళ్లిద్ధరికి రెండేళ్ల కిందటే పెళ్లి నిశ్చిర్థార్తం పూర్తయ్యింది. పెద్దలే పెళ్లి కుదిర్చారు. కాని అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. పెళ్లి వాయిదా పడ్డా.. అబ్బాయి, అమ్మాయి మాత్రం హద్దులో ఉండలేకపోయారు.ఇద్దరికీ సమయం చిక్కినప్పుడల్లా పర్సనల్ గా కలిసేవారు. ఇక అప్పుడప్పుడు ఎలాగో పెళ్లి చేసుకోబోయే వాళ్లమే కదా అని కాస్త తొందరపడ్డారు. ఇద్దరూ చాలా సార్లు అందులో పాల్గొన్నారు. దీంతో అమ్మాయి గర్భం దాల్చింది. తనకు కాబోయే భార్య గర్భం దాల్చిన విషయం ఆ పెళ్లి కొడుకుకు కూడా తెలుసు. అప్పుడప్పుడు టెస్ట్ లు చేయించేవాడట. బేబీ నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఫోన్ లో సూచనలు కూడా ఇచ్చేవాడంట. ఇక బంధువులు చివరకు అసలు విషయం తెలుసుకుని ఆ పెళ్లి+తొట్లె (బిడ్డను ఊయలలో వేసే కార్యక్రమం) కార్యక్రమాలున్నాయంటే ఇంకో రెండు రోజులు సెలవులు పెట్టుకుని వచ్చే వాళ్లం కదా అనుకున్నారంట.

Comments

comments

Share this post

scroll to top