ఉదయం లేవగానే….పురుషుడి అంగం గట్టిబడి ఉండడానికి కారణాలేంటో తెలుసా?

శృంగార‌మ‌నేది ఇద్ద‌రు దంప‌తుల మ‌ధ్య జ‌రిగే ఓ ప్ర‌కృతి కార్యం. దంప‌తులిద్ద‌రూ అందులో పోటీ ప‌డితేనే వారు జీవితంలో అన్ని విష‌యాల్లోనూ స‌మ ఉజ్జీలుగా ఉంటారు. అయితే ఆ క్రియ‌లో పాల్గొనాలంటే స్త్రీ, పురుషులిద్ద‌రూ పూర్తి స్థాయిలో అందుకు ఉద్యుక్తులై ఉండాలి. మ‌న‌స్సులోకి ఎలాంటి ఆలోచ‌న‌ల‌ను రానీయ‌కుండా నిర్మ‌లంగా ఉండాలి. అప్పుడే శృంగార క్రియ‌ను ఎంజాయ్ చేయ‌గ‌లుగుతారు. ఈ క్ర‌మంలో శృంగార క్రియ జ‌రిగేట‌ప్పుడు స్త్రీ మాట అటుంచితే పురుషునికి అంగం స్తంభించ‌డం చాలా ముఖ్యం. అప్పుడే ర‌తి క్రియ బాగా సాగుతుంది. కానీ నేటి త‌రుణంలో చాలా మంది పురుషులు అంగ స్తంభ‌న స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే చాలా మందికి అస‌లు స‌మ‌యంలో స్తంభించ‌డం లేద‌ట‌. రాత్రి పూట, లేదంటే ఉద‌యాన్నే… ఇలాంటి స‌మయాల్లో ర‌తి క్రీడ చేయ‌కున్నా అంగం స్తంభిస్తుంద‌ట‌. అస‌లు ఇలా ఎందుకు జ‌రుగుతుందో డాక్ట‌ర్ తొబియాస్ కోహ్ల‌ర్ అనే వైద్యుడు వివ‌రిస్తున్నాడు.

erection

ఆరోగ్యంగా ఉన్న పురుషుల‌కు ర‌తి క్రీడ చేయ‌కున్నా రాత్రి స‌మ‌యంలో 3 నుంచి 5 సార్లు అంగం దానంత‌ట అదే స్తంభిస్తుంద‌ట‌. ఇలా ఎందుకు జ‌రుగుతుందంటే పురుషుల్లో రోజంతా నోరాడ్రిన‌లిన్ అనే హార్మోన్ విడుద‌ల‌వుతుంద‌ట‌. ఎక్కువగా ఒత్తిడి ఉండ‌డం మూలానే ఇది విడుద‌ల అవుతూ ఉంటుంది. అయితే రాత్రి పూట అయ్యే స‌రికి ఈ హార్మోన్ విడుద‌ల‌వ‌డం త‌గ్గుతుంది. దీంతో ఒత్తిడి త‌గ్గి, మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారి, రాత్రి పూట ప‌డుకోగానే అంగ స్తంభ‌న‌లు క‌లుగుతాయ‌ట‌. ఈ క్ర‌మంలో కొంద‌రికి 5 సార్ల క‌న్నా ఎక్కువ‌గానే అంగ స్తంభ‌న క‌లుగుతుంటుంద‌ట‌. అది ఉద‌యం వ‌ర‌కు అలాగే ఉంటుంద‌ట‌. అందుకే ఉద‌యం లేవ‌గానే చాలా మంది పురుషుల‌కు అంగం స్తంభిస్తుంటుంది. అయితే ఇది ఆరోగ్య‌క‌ర ల‌క్ష‌ణ‌మే అని కోహ్ల‌ర్ చెబుతున్నారు.

కానీ కొంద‌రిలో ర‌తి క్రీడ స‌మ‌యంలో అంగం స్తంభించకుండా మిగ‌తా స‌మ‌యాల్లో స్తంభిస్తుంది. అందుకు వారి ఒత్తిడే కార‌ణం. ఎక్కువ‌గా ఒత్తిడి లేకుండా చూసుకుంటే ఆ స‌మ‌యంలో అంగ స్తంభ‌న స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. కాగా ఏ స‌మ‌యంలోనూ అంగ స్తంభ‌న‌లు క‌ల‌గ‌కుంటే అలాంటి వారి అంగానికి ర‌క్తం స‌ర‌ఫ‌రా త‌గ్గింద‌ని, వారికి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయ‌నో, రాబోతున్నాయ‌నో తెలుసుకోవాలి. హై కొలెస్ట్రాల్‌, హై బీపీల కార‌ణంగా కూడా అంగ స్తంభ‌నలు త‌గ్గుతాయి. పురుషుల‌కు అత్యంత అవ‌స‌ర‌మైన టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ త‌గినంత‌గా లేక‌పోయినా అంగ స్తంభ‌నలు త‌గ్గుతాయి. అయితే కొంద‌రిలో కేవ‌లం రాత్రి పూట మాత్ర‌మే అంగ స్తంభ‌న‌లు వ‌చ్చి ఉదయం పూట రావు. కానీ దీనికి చింతించాల్సిన ప‌నిలేద‌ని, ఒత్తిడి ఎక్కువ‌గా ఉన్న వారికి ఇది స‌హ‌జ‌మ‌ని కోహ్ల‌ర్ వివ‌రిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top