“ఉదయ్ కిరణ్” మరణం వెనకున్న అసలు నిజాలు బయటపెట్టిన అతని సోదరి..! ఏమన్నారో తెలుసా..? [VIDEO]

తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పరిశ్రమలో ఓ సంచలనం. ఆయన మరణించి ఇప్పటికి మూడు సంవత్సరాలు అయినా..ఇప్పటికి అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు సమాధానం దొరకకుండా మిగిలిపోయాయి. ఉదయ్ కిరణ్ మరణించిన సమయంలో రకరకాల వార్తలు వినిపించాయి. ఆర్ధిక ఇబ్బందులు అని, తినడానికి ఏమి లేదని. భార్య హింసించేది అని. చిరంజీవి కూతురుతో పెళ్లి కాన్సుల్ అని. ఇలా చాలా వార్తలే వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు సమాధానం దొరకని ఆ ప్రశ్నలకు మొదటి సారి “ఉదయ్ కిరణ్” సోదరి “శ్రీదేవి” ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

చిరంజీవి గారి కూతురుతో పెళ్లి రద్దు చేయడం అనేది “ఉదయ్” తీసుకున్న నిర్ణయం. ఎంగేజ్మెంట్ తర్వాత అభిప్రాయాలు కలవకపోవడంతో ఉదయ్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. చిరంజీవి ఎప్పుడు తన సోదరుడికి అండగా నిలిచారని, పెళ్లి రద్దయిన తర్వాత ఉదయ్ కెరీర్ నాశనం కావడానికి చిరంజీవే కారణమనే రూమర్లు వాస్తవం కాదని ఆమె స్పష్టం చేసింది.

udaykiran-new movie

ఉదయ్ కిరణ్ మరణించే సమయంలో ఫైనాన్షియల్ సమస్యలున్నట్లు, పాల ప్యాకెట్లకు కూడా డబ్బు లేవు అనే వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అబద్దం. మియా పూర్, శంషాబాద్ మూడు ల్యాండ్స్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకులో గోల్డ్ ఉంది. మనీ లేక పోవడ కారణం కాదు, సినిమాల్లేక పోయినా జీవించే స్తోమత ఉంది అని తమ్ముడి గురించి శ్రీదేవి చెప్పుకొచ్చారు.

ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఒకరిని ప్రేమించాడని కానీ ఆ ప్రేమ విఫలం కావడంతో డిప్రెషన్‌కి గురయ్యాడని శ్రీదేవి పేర్కొంది. ఆ సమయంలో తన సోదరుడికి చిరంజీవి మానసిక స్థైర్యం అందించారని పేర్కొంది. ఆ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత తన కూతురు సుస్మితని పెళ్లాడమని చిరంజీవి కోరారని, అందుకు ఉద‌య్ కూడా ఒప్పుకున్నాడ‌ని తెలిపింది. కానీ ఉదయ్ నిర్ణయంతో అనూహ్యంగా అది బ్రేకప్ అయ్యిందని ఆమె చెప్పింది. తర్వాత చిరు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేని తెలిపింది.

చిరు కూతురితో పెళ్లి రద్దయ్యాక ఉదయ్ కిరణ్ 2012లో విషితను పెళ్లాడారు. తర్వాత రెండేళ్లకు ఆయన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయ్ మరణం మీద మీకెలా డౌట్ ఉందో నాకూ అలాగే ఇంకా కొన్ని డౌట్ ఉన్నాయి. మరణించిన రోజు ఉదయమే మాట్లాడాను. ఎప్పుడూ ఏ కష్టం ఉన్నట్లు చెప్పలేదు. సినిమాల్లేక, డబ్బుల్లేక కాదు. పెళ్లి కూడా ఇష్ట ప్రకారమే చేసుకున్నాడని శ్రీదేవి తెలిపారు.

watch video here:

ఉదయ్ పోయిన తర్వాత విషిత మాతో మాట్లాడలేదు. ఇపుడు టచ్ లేదు, కాంటాక్టులో లేదు. ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఉదయ్ ప్రాపర్టీ అంతా తన చేతిలోనే ఉంది. ఇపుడు పరిస్థితి చూస్తుంటే అప్పుడప్పుడూ డౌట్ అనిపిస్తుంది.

Comments

comments

Share this post

scroll to top