వెండితెర మీదకు ఉదయ్ కిరణ్ చివరి చిత్రం.

ఉదయ్ కిరణ్  చిన్న వయస్సులోనే  ఫిల్మ్ ఫేర్ అవార్డు సాధించిన హీరో.  చిత్రం సినిమాతో శ్రీకారం చుట్టి హ్యాట్రిక్  హిట్లు కొట్టిన లవర్ బాయ్. 2014 జనవరి 6 న ఉదయ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతని చివరి సినిమా మనల్ని అలరించనుంది. చిత్రం చెప్పిన ప్రేమకథ అనే పేరుతో  ఆయన జన్మదినం అయిన జూన్ 26 న  విడుదల కానుంది.

udaykiran-new movie

ఉదయ్ కిరణ్ కు  గతంలో మేనేజర్ గా వ్యవహరించిన మున్నా ఈ సినిమా కు నిర్మాత. నా మొదటి సినిమా ఉదయ్ కు చివరి సినిమా అవుతుందని అనుకోలేదని చెప్పారు.ఈ సినిమాలో హీరోయిన్స్ గా డింపుల్, మదాలస శర్మ నటించారు. మోమన్ దర్శకుడిగా, మున్నాకాశీ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు.  ఉదయ్ నటించిన ప్రతి సినిమా కూడా మ్యూజికల్ హిట్, అలాగే ఈ సినిమా పాటలు కూడా  అందరిని ఆకట్టుకుంటాయని చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు.

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top