మహానటి పేరుతో సావిత్రి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించి సూపర్ హిట్ కొట్టాడు యువదర్శకుడు నాగ్ అశ్విన్. కమర్షియల్ గా మూవీ హిట్ అవ్వడంతో పాటు క్రిటిక్స్, సినీ ఇండస్ట్రీ పెద్దలు సైతం ఈ సినిమాను మెచ్చుకున్నారు. లేడీ సూపర్ స్టార్ సావిత్రికి సంబంధించి రీల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ ను బ్యాలెన్స్ గా చూపిస్తూ మంచి మార్కులే కొట్టేశాడు నాగ్ అశ్విన్….అయితే ఈ సినిమా ఇచ్చిన ఊపుతో తెలుగులో మరో బయోపిక్ కు రంగం సిద్దమైంది. లవర్ బాయ్ గా చెరిగిపోని ముద్ర వేసిన ఉదయ్ కిరణ్ జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నాలు సాగుతున్నాయి.!
ఉదయ్ కిరణ్ ను చిత్రం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజనే ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.! ఉదయ్ కిరణ్ కెరీర్ లోనే దిబెస్ట్ మూవీ నువ్వు-నేను ను డైరెక్ట్ చేసింది కూడా తేజనే..దానికి తోడు ఉదయ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా తేజకు చాలా వరకు తెలుసు….అందుకే ఈ ప్రాజెక్ట్ కు అతనే కరెక్ట్ అని అంతా ఫిక్స్ అయ్యారు. ఇక ముహుర్తం షాటే తరువాయి.!