రెండేళ్ళ పిల్లాడి ఆరాటం..తన ఫ్యామిలీ కోసం.

ఓ రెండేళ్ళ పిల్లాడు..అతని  ముందే అతని తమ్ముడిని తీసుకువెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. అది చూసిన అతడు తన వయస్సుకు మించి, తన శక్తినంతా కూడదీసుకొని పోరాటం చేస్తున్నాడు. కిందా మీదా పడి తమ్ముడిని తీసుకుపోనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. ఈ సారి తమ్ముడుని వదిలి చెల్లిని తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది.. మళ్లీ ఆ బుడతడు అదే పోరాటం చేశాడు. ఈ సారి ఇద్దర్నీ తీసుకుపోయే ప్రయత్నం జరిగింది…ఇప్పుడు మనోడి పోరాటం చూస్తుంటే గోన గన్నారెడ్డి, బాహుబలిలు గుర్తొచ్చారు.

వాస్తవానికి ఇదంతా ఆ కుర్రాడిని ఆటపట్టించడానికి చేసిందే… కానీ ఏమీ తెలియని ఆ కుర్రాడు, నిజంగానే తన ఫ్యామిలీని తనకు కాకుండా చేస్తున్నారనుకొని చేసిన పోరాటం ఇది. దీన్ని చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయ్.. తన వయస్సును తన శక్తిని ఏ మాత్రం లెక్కచేయకుండా తన ఫ్యామిలీని కాపాడడమే తన కర్తవ్యం అన్నట్టు వ్యవహరించిన ఈ పిల్లాడి తెగవకు సెల్యూట్ చేయాల్సిందే.

దీనిని ఓ కల్పిత వీడియోగా కాక… తమ్ముళ్ళను రక్షించే అన్న పడే తపనగా చూడండి.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top