ఇక‌పై రాత్రే కాదు…ప‌గ‌లు కూడా బండి లైట్స్ ఆన్ చేసే ఉంచాలి..ఎందుకో తెలుసా..?

మనం ద్విచక్రవాహనం పై వెళుతున్నప్పుడు పగటి పూట పొరపాటున లైట్ వేసుకొని వెళుతున్నాము అనుకోండి!…వెంటనే ఎదురుగ వచ్చేవారు మనకి లైట్ వేసి ఉంది అని సంకేతం ఇస్తారు!..ఇలాంటి సంఘటన వాహనం నడిపే ప్రతి ఒక్కరికి ఎదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటది…కానీ ఏప్రిల్ 1 నుండి పగటి పూట కూడా ద్విచక్ర వాహనం లైట్ వేసుకొనే నడపాలి అంట!…అదేంటి అని షాక్ అవుతున్నారా?..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇచ్చిన ఆదేశాలు అవి!…వివరాలు ఏంటో చూడండి!

ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్‌ ఆన్‌ (ఏహెచ్‌వో):

ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి విక్రయించే వాహనాల్లో ‘ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్‌ ఆన్‌ (ఏహెచ్‌వో)’ టెక్నాలజీని తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.  అయితే పాత వాహనాలకు మాత్రం ఈ కొత్త ప్రక్రియ వర్తించదు!…ఇక పై మార్కెట్ లోకి వచ్చే కొత్త వాహనాలకు “లైట్ ఆన్ / ఆఫ్” స్విచ్ ఉండదు…ఇంజిన్ ఆన్ చేయగానే లైట్ కూడా ఆన్ అవుతుంది…ఇంజిన్ ఆఫ్ చేయగానే లైట్ కూడా ఆఫ్ అవుతుంది..

ఇలా చేయడానికి కారణం:

కారు, బస్సు, లారీ…ఇలా భారీ వాహనాలకు ఎదురుగ వచ్చే ద్విచక్ర వాహనాలు సరిగా కనపడకపోవడం వాళ్ళ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి…ఒక ఏడాదిలో ఈ కారణంగా 30000 ఆక్సిడెంట్ లు జరుగుతున్నాయి అంట!… ఈ విషయాన్నీ పరీశిలించిన సుప్రీమ్ కోర్ట్ ఏర్పాటు చేసిన కమిటీ ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ఈ కొత్త విధానాన్ని మన దేశంలో కూడా అమలు చేయాలనీ సూచించింది!…యూరప్, మలేషియా వంటి చాలా దేశాల్లో 2003 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

పగలు కూడా లైట్ వెలగడం వల్ల బాటరీ తొందరగా అయిపోతుందా?

ఇప్పుడు ఉన్న ద్విచక్రవాహనాలపై బాటరీ సాయంతో హెడ్ లైట్ వెలుగుతుంది..అయితే పగలు కూడా లైట్ వేసి ఉండటం వల్ల బాటరీ త్వరగా అయిపోతుంది అని వినియోగదారులు భావిస్తారు!…కానీ కొత్తగా తయారయ్యే వాహనాలలో “ఏహెచ్‌వో టెక్నాలజీ” ఉండటం వల్ల బాటరీతో సంబంధం లేకుండా నేరుగా పెట్రోల్ సాయంతోనే బల్బ్ వెలుగుతుంది అంట!…

ఏది ఏమైనా…మనకి నచ్చిన నచ్చకపోయినా!…ఏప్రిల్ 1 నుండి వచ్చే వాహనాలకు లైట్ ఆన్ / ఆఫ్ ఉండదు…ఇప్పటికే కొన్ని వాహనాలు ఈ టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది!…ప్రమాదాలను అరికట్టే ఈ చర్యపై పోలీస్ శాఖ, రవాణా శాఖ హర్షం వ్యక్తం చేసారు!

Comments

comments

Share this post

scroll to top