హైదరాబాద్ రోడ్డుపై గుండె పోటుతో ప‌డిపోయిన వ్య‌క్తికి ప్రాణ దానం చేశారు ఆ ఇద్ద‌రు ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌.! ఎలాగంటే.?

ప్రాణాపాయ ప‌రిస్థితిలో ఉన్న మ‌నిషిని కాపాడ‌డం అంటే మామూలు విష‌యం కాదు. నిజంగా అలాంటి ప‌నిచేసే వారిని దేవుడ‌నే చెప్పాలి. ఎందుకంటే అలాంటి ప‌రిస్థితిలో ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా, నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినా ప్రాణాలు పోయేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఇలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుని మ‌నిషిని కాపాడాల్సి ఉంటుంది. అప్పుడే అలా ప్రాణాలు కాపాడే వారిని దేవుడ‌ని అంటారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇటీవ‌లే జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన ఆ ఇద్ద‌రు కానిస్టేబుల్స్ కూడా అంద‌రితో దేవుళ్ల‌ని పిల‌వ‌డుతున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

చంద‌న్ సింగ్‌, ఐన‌తుల్లాఖాన్ ఖాద్రి అనే ఇద్ద‌రు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ జ‌న‌వ‌రి 31వ తేదీన మ‌ధ్యాహ్నం 12.30 గంటల స‌మయంలో పురాణాపూల్ వ‌ద్ద విధులు నిర్వ‌హిస్తున్నారు. అయితే అదే స‌మయానికి ధూల్ పేట నుంచి తాడ్‌బండ్ వైపు స్కూట‌ర్‌పై వెళ్తున్న ఓ వ్య‌క్తి స‌డెన్‌గా కింద ప‌డిపోయాడు. మొద‌ట అంద‌రూ యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ యాక్సిడెంట్ కాదు. అత‌నికి గుండె పోటు రావ‌డంతో స్కూట‌ర్ పైనుంచి కింద ప‌డ్డాడు. దీంతో అత‌నికి గాయాల‌య్యాయి. అయితే అత‌న్ని చూసిన చంద‌న్ సింగ్‌, ఖాద్రిలు ఇద్ద‌రూ ప‌రుగు ప‌రుగున అత‌ని వ‌ద్ద‌కు చేరుకున్నారు.

ట్రాఫిక్ కానిస్టేబుల్ చంద‌న్ సింగ్ మ‌రో వాహ‌న‌దారుడు క‌లిసి ఆ వ్య‌క్తిని కూర్చోబెట్టి ప‌ల్స్ చెక్ చేశారు. హార్ట్ బీట్ లేదు. దీంతో చంద‌న్ సింగ్ ఏ మాత్రం ఆల‌స్యం చేయకుండా తాను తీసుకున్న సీపీఆర్ ట్రెయినింగ్‌ను అక్క‌డ వాడాడు. ఆ వ్యక్తికి సీపీఆర్ (cardiopulmonary resuscitation) చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు. గుండె పోటు ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకుని సుర‌క్షితంగా ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డాడు. ఇందుకు చంద‌న్ సింగ్‌ను అంద‌రూ అభినందించారు. అయితే మ‌రో కానిస్టేబుల్ ఖాద్రి ట్రాఫిక్‌ను స‌మ‌ర్థవంతంగా క్లియర్ చేశాడు. ఆంబులెన్స్‌కు ఫోన్ చేసి ర‌ప్పించాడు. దీంతో ఆ వ్య‌క్తిని ఆంబులెన్స్‌లో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అలా ఆ ఇద్ద‌రు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఓ వ్యక్తి ప్రాణాన్ని దేవుళ్ల‌లా కాపాడారు.

అయితే చంద‌న్ సింగ్ ఆ వ్య‌క్తికి సీపీఆర్ ఇచ్చే స‌మ‌యంలో ఎవరో వీడియో తీసి దాన్ని నెట్‌లో పెట్టారు. దీంతో అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం వీక్షించారు. స‌ద‌రు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ చేసిన ప‌నిని ఆయ‌న అభినందించారు. అంతేకాదు, గ‌తంలో కానిస్టేబుల్స్ అందరూ సీపీఆర్ ట్రెయినింగ్ తీసుకున్నార‌నే విష‌యాన్ని గుర్తు చేశారు. ఏది ఏమైనా ఆ ఇద్ద‌రు కానిస్టేబుల్స్ చేసిన పనికి వారిని అభినందించ‌కుండా ఉండ‌లేం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top