తెలుగు రాష్ట్రాల్లో మోత మోగుతున్న రెండు ప్రశ్నలు?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రశ్నలు హల్ చల్ చేస్తున్నాయ్ …. అదిలాబాద్  నుండి మహబూబ్ నగర్ వరకు, శ్రీకాకుళం నుండి తిరుపతి వరకు రెండు ప్రశ్నలు తెగ  మారు మోగుతున్నాయ్. ఈ రెండు ప్రశ్నలు  మీరు ఇతరులను  అడగడమో , ఇతరులు  మిమ్మల్ని అడగడమో  ఈ పాటికే జరిగిపోయి ఉంటాయ్. దాదాపు తెలుగు రాష్ట్రాలోని సగం మంది జనాభా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఉంటారు. ఇంకా చెబుతూనే ఉన్నారు.

వయసు పై బడిన వారు ఇంటి పక్క వాళ్లని.  కుర్రకారు ఫ్రెండ్స్ ని, జాబ్ చేసే వాళ్లు వాళ్ల కొలిగ్స్ ను ఈ రెండు ప్రశ్నలు అడిగే ఉంటారు.  అంతలా పాపులర్ అయిపోయాయ్ ఆ రెండు క్వశ్చన్స్.. మరో విషయం ఏంటంటే రెండు ప్రశ్నల్లో ఏదో ఒక దానికి యస్ అనే తలూపి ఉంటారు చాలా మంది. కొందరైతే రెండు క్వశ్చన్స్ కు రెండూ సక్సెస్ ఫుల్ గా చేశానోచ్ అని సంకలు గుద్దుకొని కూడా ఉంటారు.

ఓయ్ ఆ ప్రశ్నలేంటోో చెప్పకుండా ఈ సొల్లు ఏంది అనే కదా మీ కోపం…. చెప్పేస్తున్న తెలుగు రాష్ట్రాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న  ఆ రెండు ప్రశ్నల గురించి. ఆ రెండు ప్రశ్నలు ఏంటంటే 1) మీరు బాహుబలి సినిమా చూశారా? 2) మీరు గోదావరి పుష్కరాలకు వెళ్లారా?

shivagami1

pushkaralu

నిజం మాట్లాడుకుందాం… ఈ రెండు ప్రశ్నలు అడగని వారు, ఆడిగించుకోని వారు ఉన్నారా మీలో  ఎవరైనా.. ఒకటేమో జక్కన్న చెక్కిన వెండితెర అద్బుతం, మరోటి పవిత్ర గోదారమ్మ ప్రసాదించిన పుష్కర స్నానం. గత వారం రోజులుగా ఎక్కడ చూసిన ఇదే చర్చ… బాహుబలి చూశారా? పుష్కర స్నానం చేశారా? అంటూ ఆ రెండు ప్రశ్నలే ఎదురవుతున్నాయ్.

బాహుబలి జులై 2 న విడుదల కావడం దాని తర్వాత జులై 14 నుండి పుష్కరాలు స్టార్ట్ అవ్వడం.. రెండూ దాదాపు ఓకే సారి రావడంతో రెండింటిని దర్శించి తరించారు ఇక్కడ ప్రేక్షకులు,అక్కడ భక్తులు ..ఆల్ హ్యాపీస్….. మరి మీ సమాధానం ఏంటి ఈ రెండు ప్రశ్నలకు???????????????????????????????????????????????????

For FB Updates:   CLICK HERE

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top