లంచం సొమ్ము కోసం పోలీసుల కుమ్ములాట‌… షాక్‌కు గురవుతున్న జ‌నాలు…

పోలీసులంటే ఎలా ఉండాలి..? స‌మాజంలో ఎల్ల‌ప్పుడూ శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ర‌క్షించేవారుగా ఉండాలి. నిజాయితీగా ప‌నిచేయాలి. అవినీతి ప‌నుల‌కు దూరంగా ఉండాలి. ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి. ఇవ‌న్నీ వారు క‌చ్చితంగా చేయాల్సిన విధులు. కానీ ఆ పోలీసులు మాత్రం అలా కాదు. ఇందుకు పూర్తిగా భిన్నం. తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌నే స‌ద‌రు పోలీసుల నీతి నిజాయితీల‌ను ప్ర‌శ్నిస్తోంది. ఇలాంటి పోలీసులా మాకు కావ‌ల్సింది? అంటూ జ‌నాల‌ను ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇంత‌కీ ఏంటా సంఘ‌టన‌..? చూద్దాం ప‌దండి.

lucknow-police

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌ధాని న‌గ‌రం ల‌క్నోలో ఇటీవ‌ల ఇద్ద‌రు పోలీసులు ప‌ట్ట ప‌గ‌లే న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే విప‌రీతంగా కొట్టుకున్నారు. తాము పోలీసులమ‌న్న జ్ఞానం కూడా లేకుండానే వీధి గూండాల‌ను త‌ల‌పించేలా క‌ల‌బ‌డ్డారు. దీంతో ఆ సంఘ‌ట‌న‌ను చూసిన జ‌నం ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు. త‌మ‌కు ఆప‌ద వ‌స్తే ర‌క్షించాల్సిన పోలీసులేనా ఇలా కొట్టుకుంటోంది అని వారు షాక్‌కు గురయ్యారు. కాగా ఈ తంతునంతా కొంద‌రు త‌మ స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు. అలా ఆ ఇద్ద‌రు పోలీసులు త‌న్నుకున్న వీడియో ఇప్పుడు దేశ‌మంత‌టా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వారి వీడియో ఇంట‌ర్నెట్‌లో, సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. కాగా త‌న్నుకుంటున్న ఆ ఇద్ద‌రు పోలీసుల‌ను మ‌రో ఇద్ద‌రు పోలీసులు చివ‌రికి ఎలాగోలా విడిపించారు. అది వేరే సంగ‌తి. కానీ గూండాల్లా త‌న్నుకున్న ఆ పోలీసుల గురించే ఇప్పుడు చ‌ర్చంతా సాగుతోంది. అస‌లు వార‌లా ఎందుకు త‌న్నుకున్నార‌ని వాక‌బు చేస్తే…

అక్క‌డే స్థానికంగా ఉన్న ఓ దుకాణ య‌జ‌మాని వ‌ద్ద వ‌సూలు చేసిన లంచం సొమ్మును పంచుకునే విష‌య‌మై ఆ ఇద్ద‌రు పోలీసుల‌కు గొడ‌వైంద‌ట‌. దీంతోనే వారిరువురి మ‌ధ్య మాటా మాటా పెరిగి అది చివ‌ర‌కు త‌న్నులాట‌కు దారి తీసింది. ఒక‌రి గ‌ల్లాలు ఒక‌రు ప‌ట్టుకుని మ‌రీ కొట్టుకునేలా చేసింది. అదీ అస‌లు సంగ‌తి. చూశారా, ఆ పోలీసుల తీరు. ఏదైనా ఆప‌ద వ‌స్తే న్యాయం చేయ‌మంటూ ఎంతో న‌మ్మ‌కంతో మ‌నం అదే పోలీసుల‌కు వ‌ద్ద‌కు వెళ్తామే, మ‌రి వారి స్థానంలో ఇలాంటి లంచ‌గొండులు ఉంటే ఇక అప్పుడు మ‌న‌కు న్యాయం ఏం జ‌రుగుతుంది మీరే చెప్పండి. అప్పుడు డ‌బ్బున్న వాడికే అలాంటి పోలీసులు అంద‌ల‌మేస్తారు. వారినే నెత్తిన పెట్టుకుంటారు. అంతే క‌దా మరి! అలాంటి అవినీతి ప‌రులైన పోలీసుల వ‌ల్లే కొంత మంది నిజాయితీ ఉన్న అధికారుల‌కు కూడా మ‌చ్చ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో అలా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతూ పోలీసు వృత్తికే మ‌చ్చ తెస్తున్న ఆ త‌ర‌హా పోలీసు అధికారుల‌ను అస్స‌లు ఉపేక్షించ‌కూడ‌దు. వారిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే. లేదంటే ప్ర‌జ‌ల‌కు పోలీసుల‌పై ఇంకా న‌మ్మ‌కం పోతుంది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top