ఊపిరిపీల్చుకోవడం కష్టమైన అతనికి నోటితో గాలి ఊది ప్రాణాలు రక్షించిన ఇద్దరమ్మాయిలు!

సికింద్రాబాద్ లోని రద్దీ రోడ్డులో ఒకతను బైక్ పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. తలకు  గాయమైన ఆ వ్యక్తి  చావుబతుకుల మధ్య   కొట్టుమిట్టాడుతున్నాడు. అక్కడున్న జనాలు అందరూ ఎగబడి చూస్తున్నారు, తమ సెల్ ఫోన్లతో  ఫోటోలు తీస్తున్నారు. అతడికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన  పడకుండా, ఫోటోలు తీసుకుంటూ, వీడియో తీస్తూ తమ తమ సోషల్ నెట్ వర్క్ లో షేర్ చేస్తున్నారు కానీ, ఒక్కరు కూడా అంబులెన్స్ కు ఫోన్ చేయలేదు, అతడి గురించిన కనీసం మానవత్వం మరిచారు.  అదే టైంలో ఇద్దరు అమ్మాయిలు ఏం జరిగిందా అని, అందరినీ తోసుకుంటూ ప్రమాద స్థలానికి చేరుకొని, నిస్సహాయంగా ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న అతడ్ని చూసి చలించిపోయారు.

అతడిచేయి పట్టుకొని పల్స్ చెక్ చేశారు. ఇంకా బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న వారిద్దరూ అతడిని బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు. నోరు మొత్తం మూసుకుపోయింది. నాలుక లోపలికి వెళ్లి ఊపిరి తీసుకోవడానికి వీలుకావడం లేదు. తమ దగ్గర ఉన్న పెన్నుతో నాలుకను బయటకు తీసి, గొంతు గుండా గాలిని పీల్చుకునేల చేశారు. ఒక న్యూస్ పేపర్ ను తీసుకొని గొట్టంలా అమర్చి నోటి ద్వారా గాలిని అందించారు. మరొకరు ఛాతీపై నొక్కుతూ అతడి హృదయ స్పందన ఆగకుండా చేస్తోంది. 25 నిముషాలకు పైగా ఇలా చేస్తున్నారు.

doctor-750x500

అలా చేస్తుండగా ఇంతలోనే అంబులెన్స్ వచ్చి అతడికి ఆక్సీజన్ ను సెలైన్ ను ఎక్కించారు.అంబులెన్స్ లో ఎక్కించగానే అతడి గుండె నార్మల్ గా కొట్టుకుంటోంది. ఆ ఇద్దరు మహిళలు హమ్మయ్య అనుకున్నారు. ఎలాంటి స్వార్థం చూసుకోకుండా, అందరిలా చేతులు ముడుచుకొని కూర్చోకుండా ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని కాపాడారు. ఇది చూసి అక్కడున్న వాళ్ళు మెచ్చుకుంటున్నా, ఏమీ చేయలేక ఫోటోలు తీస్తున్న వాళ్ళు సిగ్గుతో తలదించుకున్నారు. ఇంతకీ ఆ మహిళలెవరో చెప్పలేదు కదూ.. సికింద్రాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తున్న డాక్టర్ ఫైజా అంజుమ్ మరియు డాక్టర్  సావిత్రి దేవి. నిజానికి వీరిద్దరూ అనుభవమున్న వైద్యులేం కాకపోయినా, తమకు తెలిసిన వైద్యంతో అతడిని కాపాడారు.

Comments

comments

Share this post

scroll to top