కొండ‌పై స‌ర‌దాగా చేసిన ప‌ని వారిని 2వేల అడుగుల లోతున్న లోయ‌లోకి ప‌డేసి ప్రాణాలు తీసింది..! (వీడియో)

విహార యాత్ర‌ల‌కు వెళ్లిన‌ప్పుడు ఎవ‌రైనా ఎంజాయ్ చేయాల‌నే చూస్తారు. అంతేకానీ ప్రాణాల‌ను పోగొట్టుకోవాల‌ని చూడ‌రు క‌దా. అయితే అలాంటి స‌మ‌యాల్లో కొంద‌రు చేసే స‌ర‌దా ప‌నులే వారి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో సెల్ఫీ పిచ్చి వ‌ల్ల ఎంతో మంది చ‌నిపోయారు. ఇప్పుడు చెప్ప‌బోయే ఘ‌ట‌న కూడా ఇలాంటిదే. కాక‌పోతే ఇది సెల్ఫీ వ‌ల్ల జ‌రిగింది కాదు, స‌ర‌దా వ‌ల్ల జ‌రిగింది. 2వేల అడుగుల ఎత్తులో ప్ర‌కృతి అందాల‌ను వీక్షిస్తూ స‌రిహ‌ద్దుగా ఉన్న పిట్ట‌గోడ‌కు అవ‌త‌లి వైపుకు వెళ్లారు. అంతే, ప‌ట్టు త‌ప్పి పాతాళంలో ప‌డిపోయారు.

మహారాష్ట్రలోని అంబోలి ఘాట్ కు చాలా ప్రాముఖ్య‌త ఉంది. ఇదొక ప‌ర్యాట‌క ప్ర‌దేశం. ఇక్క‌డికి చాలా మంది విహార‌యాత్ర‌కు వ‌స్తుంటారు. అలాగే ఓ 7 మంది యువ‌కులు కూడా ఇక్క‌డికి వ‌చ్చారు. అయితే అందులో ఇద్ద‌రు యువ‌కులు మాత్రం స‌ర‌దాగా ఉంటుంద‌ని చెప్పి మద్యం సేవిస్తూ పిట్ట‌గోడ‌పై ప్ర‌మాద‌క‌రంగా కూర్చున్నారు. దీన్ని ఇవ‌త‌లి వైపు ఉన్న వారి స్నేహితులు త‌మ సెల్ ఫోన్‌లో రికార్డు చేయ‌సాగారు. కానీ వారు పిట్ట‌గోడ‌పై కూర్చున్న వారిని ఆపే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఈ క్ర‌మంలో వారు పిట్ట‌గోడ నుంచి దిగి ఓ సారి ఇవ‌త‌లికి వ‌చ్చారు. మ‌ళ్లీ ఏమైందో తెలియ‌దు, పిట్ట‌గోడ‌ను మ‌రోసారి ఎక్కి ఏకంగా అవ‌త‌లి వైపుకు నిల‌బ‌డ్డారు. దీన్ని చూస్తున్న వారి స్నేహితులు వ‌ద్ద‌ని వారించారు. అయినా ఆ ఇద్ద‌రు యువ‌కులు విన‌లేదు. పిట్ట‌గోడ‌కు అటు వైపే ఉన్నారు. దీంతో వ‌ర్షం కార‌ణంగా ఆ ప్రాంతంలో వారి ప‌ట్టు త‌ప్పింది. వెంట‌నే ఇద్ద‌రూ కింద‌కు లోయ‌లోకి ప‌డిపోయారు. సుమారుగా 2వేల అడుగుల ఎత్తు లోయ‌లోకి ప‌డి అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు.

కాగా మృతులను ఇమ్రాన్‌ గరాడి (26), ప్రతాప్‌ రాథోడ్‌(21)గా పోలీసులు గుర్తించారు. శవాలు ఇంకా లభ్యం కాలేదని భారీగా వర్షం పడుతుండటంతో గాలింపు చర్యలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. వీరంతా కొల్హాపూర్‌లోని ఫౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. చూశారుగా… స‌ర‌దా ఎంత‌టి ప‌ని చేసిందో. అయితే వారు అలా ప‌డిపోయేట‌ప్పుడు సెల్ ఫోన్‌లో వారి స్నేహితులు రికార్డు చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Comments

comments

Share this post

scroll to top