విద్యార్ధులంటే వీరు.! 3 K.M లు వెంబడించి మరీ ఉగ్రవాదులను పట్టుకున్నారు, పెను ప్రమాదాన్ని తప్పించారు.!

అది అస్సాంలోని ఓ స్కూల్.. సుమారు 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆ స్కూల్ లోకి ప్రవేశించారు. వారికి ఎదురుపడ్డ ఓ సార్ ను ఏదో ఇన్పర్మేషన్  అడుగుతున్నారు. చిన్న గొడవలాగా వినిపించడంతో అప్పటి వరకు క్లాస్ లో పిల్లలకు పాఠం చెబుతున్న జీతన్ దాస్ బయటకు వెళ్లాడు. ఏంటీ.? సార్…విషయం, వీరెవరు? అని అడిగాడు. అక్కడున్న సార్ తో.  దానిని నీకెందుకు ఇక్కడి నుండి వెళ్లిపో…అంటూ జీతన్ ను బెదిరించారు ఆ ఇద్దరు దుండగులు…హా.. ఏంటీ ? మీ దబాయింపు ఏంటీ..? అసలు మీరెవరు? ఇక్కడికెందుకొచ్చారు? ల్లాంటి ప్రశ్నలు అడగడంతో వెంటనే తమ వద్దనున్న గన్ తీసి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో జీతన్ దాస్ ను  కాల్చాడు ఇద్దరు దుండగుల్లో ఒకడు.
f110210mo03-e1375846239871
బుల్లెట్ దెబ్బకు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు జీతన్ దాస్, ఇదంతా క్లాస్ లోపలి నుండి చూస్తున్న విద్యార్ధులకు ఒక్కసారిగా కోపం పెల్లుబిక్కింది. పెద్ద ఎత్తున అరుచుకుంటూ దుండగుల మీదకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళను చూసిన దుండగులు అక్కడి నుండి పరుగులు తీస్తున్నారు..సుమారు 30 మంది దాకా ఉన్న పిల్లలు వారినే వెంబడిస్తున్నారు.
అలాంటి సమయంలో దుండగులు తమ వద్దనున్న గన్ తో తమ వెంటపడుతున్న పిల్లలపై కాల్పులు చేయడం స్టార్ట్ చేశారు. దీంతో కొందరు పిల్లలు భయపడి వారిని వెంబడించడం ఆపేశారు. అయినా మరికొంత మంది పిల్లలు వారిని వెంబడిస్తున్నారు ఈ సారి దుండగులు ఓ గ్రెనేడ్  ను విసిరారు…ఈ సారి పిల్లలందరు భయంతో వెనకకు పరుగులు తీశారు. కానీ ఇద్దరు విద్యార్ధులు మాత్రం వారిని అలాగే వెంబడిస్తున్నారు.  పట్టుకోండి.. మా సార్ ను కాల్చి పారిపోతున్నారంటూ అరుస్తూ వారిని తరుముతున్నారు.
photo
చివరకు అక్కడి వారి సహాయంతో దుండగులను పట్టుకున్నారు ఆ ఇద్దరు కుర్రాళ్ళు, వారి దగ్గరినుండి ఓ పిస్తోల్ ను,  ఓ గ్రెనేడ్ ను స్వాధీనం చేసుకున్నారు. తీరా చూస్తే వారు  దొంగలు కాదు ఉగ్రవాదులు…ఏదో  భారీ విధ్వంసానికి కుట్రపన్నే ఆ స్కూల్ కు వచ్చారు. ప్రాణాలకు తెగించి మరీ  ఉగ్రవాదులను పట్టించిన విద్యార్థి హీరోల పేర్లు.. రతుల్ చంద్ర రభ మరియు రితుపర్ణ బోరో, భారీ విధ్వంసాన్ని ఆపి తన ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుడు జీతన్ దాస్.

Comments

comments

Share this post

scroll to top