ఆ దేశ మ‌హిళా క్రికెట‌ర్ కోహ్లికి పెళ్లి శుభాకాంక్ష‌లు చెప్పింది. అంతే.. ఆమెను ట్విట్ట‌ర్‌లో ఆడేసుకుంటున్నారు..!

విరుష్క‌.. అదేనండీ.. విరాట్ కోహ్లి, అనుష్క‌.. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు క‌దా. అందుకే ఇద్ద‌రి పేర్ల‌ను క‌లిపి ఫ్యాన్లు కొత్త‌గా ఓ పేరును ఇలా క్రియేట్ చేశారు. దీంతో ఇప్పుడీ విరుష్క పేరే కాదు, వీరిద్ద‌రి పెళ్లి మ్యాట‌ర్ కూడా సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికీ వైర‌ల్ అవుతోంది. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రాంల‌లో వీరి పెళ్లి ఫొటోల‌కు రోజూ కోట్ల కొద్దీ లైకులు ప‌డుతున్నాయి. ఇక వీరికి పెళ్లి శుభాకాంక్ష‌లు చెప్పేవారికైదే కొదువ లేదు. ఎంతో మంది శుభాకాంక్ష‌ల‌ను తెలుపుతున్నారు. అయితే ఇలాగే ఆ దేశానికి చెందిన ఓ మ‌హిళా క్రికెట‌ర్ కూడా విరాట్ కోహ్లికి పెళ్లి శుభాకాంక్షలు చెప్పింది. దీంతో ఆమెపై ఇప్పుడు ట్విట్ట‌ర్‌లో జోకులు పేలుతున్నాయి. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే…

ఆమె పేరు డానియ‌ల్ వ్యాట్‌. ఇంగ్లండ్ దేశ మ‌హిళా క్రికెట‌ర్ ఈమె. ఈమె విరుష్క జంటకు పెళ్లి శుభాకాంక్ష‌లు చెప్పింది. కంగ్రాచులేష‌న్స్ అని ట్వీట్ చేసింది. దీంతో ట్విట్ట‌రీయులు ఇప్పుడు ఈమెను ఆడుకుంటున్నారు. ఎందుకంటే.. గ‌తంలో… అంటే.. 2014లో ఓసారి డానియ‌ల్ వ్యాట్ విరాట్ కోహ్లికి త‌న‌ను పెళ్లి చేసుకోమ‌ని మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్ పెట్టింది. కోహ్లి మ్యారీ మీ.. అంటూ ఆమె ట్వీట్ చేసింది. అయితే అది అప్ప‌టితో అయిపోయింది. కానీ ఇప్పుడు ఆమె విరుష్క జంట‌కు పెళ్లి శుభాకాంక్ష‌లు చెప్ప‌డంతో అంద‌రి దృష్టి ఆమెపై ప‌డింది.

ఒక‌ప్పుడు డానియ‌ల్ వ్యాట్ విరాట్ కోహ్లికి మ్యారీ మి అని ప్ర‌పోజ‌ల్ పెట్ట‌డంతో ఇప్పుడామె పెట్టిన ట్వీటుకు పాత ట్వీటును గుర్తు చేస్తున్నారు అభిమానులు. విరాట్ ను ప్రేమించావు, పెళ్లి చేసుకోమ‌ని అడిగావు, ఇప్పుడు కోహ్లి వేరే యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు, నువ్వు హార్ట్ బ్రోక్ అయ్యావు.. అంటూ వ్యాట్‌ను ఓదారుస్తున్నారు. ఇంకా కొంద‌రైతే… నువ్వు Kholi అని త‌ప్పుగా ట్వీట్ చేస్తూ ప్రపోజ్ చేశావు, క‌రెక్ట్ పేరుతో kohli అని ట్వీట్ చేసి ఉంటే విరాట్ నిన్ను పెళ్లి చేసుకునేవాడు కాబోలు.. అంటున్నారు. మ‌రికొంద‌రు.. బ్రోకెన్ హార్ట్‌, దృఢంగా ఉండు, నీ గుండె ప‌గిలి ముక్క‌లైంది, నీ ల‌వ్ ఫెయిల్యూర్‌.. అంటూ ట్వీట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ ట్వీట్ల సునామీ ఇప్ప‌ట్లో ఆగేలా క‌న‌బ‌డ‌డం లేదు. చివ‌ర‌కు మ‌రి ఏమ‌వుతుందో చూడాలి..!

 

Comments

comments

Share this post

scroll to top