“రావణుడి” 10 ఆధార్ కార్డులపై నెటిజెన్ క్వశ్చన్…దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన “UIDAI”

ఆధార్ పై వచ్చే విమర్శలు అన్నీ ఇన్నీకావు. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తుంటారు. విజయదశమి సందర్భంగా ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ ప్రధాన ఆకర్శణగా నిలిచింది. రావణుడికి ఎన్ని ఆధార్ నంబర్లు ఇచ్చారు అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు 10 తలలు, 10 ఐరీష్.. మొత్తం వందా అంటూ ప్రశ్నించాడు. దీనికి అదిరిపోయే సమాధానమిచ్చింది ఆధార్ సోషల్ మీడియా బృందం. అతను భారత పౌరుడు కాదు.. ఆధార్ ఎన్ రోల్ చేసుకోవలసిన అవసరం లేదంటూ సమాధానమిచ్చింది UIDAI. ఈ ఆన్సర్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఏం ఆన్సర్ ఇచ్చార్రా అంటూ నెటిజన్లు ట్వీట్ల మీద ట్వీట్లు ఇస్తున్నారు.

ఇంతకూ ఏంజరిగిందటే.. సుపరిపాలన శక్తి ఎలా ఉంటుందో తెలుసుకునే సమయమొచ్చిందంటూ ట్వీట్ చేస్తూ ఒకే బాణం పది ప్రశ్నలకు జవాబు అనే అర్థమొచ్చే రీతిలో ఆధార్ ను, రావణుడి పది తలల ఫొటోలను పెట్టింది. దీంతో డిస్ట్రయ్ ఆధార్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి రావణుడికి ఎన్ని ఆధార్ నంబర్లు ఇచ్చారంటూ కౌంటర్ వచ్చింది. ఆ కౌంటర్ కు ఇలా దిమ్మతిరిగే సమాధానమిచ్చింది ఆధార్ సోషల్ మీడియా టీమ్.

 

Comments

comments

Share this post

scroll to top