అంబానీ మరో సంచలనం : మార్కెట్ లోకి జియో ల్యాప్ టాప్ లు.! దాని ఫీచర్స్ ఇవే..!

మొబైల్ నెట్వర్క్ లో జియో ఒక సంచలనం..అతి తక్కువ రేట్లకు డాటా తెచ్చి ..టెలికాం మార్కెట్ రారాజుగా  నిలిచింది..ఏడాది కాలంలోనే దేశ ప్రజలకు డేటా రూపంలో రూ.60వేల కోట్లు మిగిల్చింది. అంటే ఎంతలా జనంలోకి దూసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండేళ్లలో టెలికాం రంగంలో తనదైన ముద్ర వేసిన జియో మరో సంచలనానికి తెర లేపింది. ‎త్వరలో జియో ల్యాప్ టాప్ లు విడుదల చేయనుంది. ప్రముఖ చిప్ తయారీ కంపెనీ క్వాల్ కామ్ ఆధ్వర్యంలో ఇవి విడుదల కానున్నాయి. ఇన్ బిల్ట్ జియో సిమ్ తోనే ఈ ల్యాప్ లాప్ లు రానున్నాయి.

జియో ల్యాప్ టాప్ లో ఉండబోయే ఫీచర్స్ …

  • విండోస్ 10పై వర్క్ చేస్తుంది.
  • ఇన్ బిల్ట్ గా జియో సిమ్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది.
  • సెల్యులార్ కనెక్టివిటీ స్నాప్ డ్రాగన్ 835 తో పని చేస్తోంది.

భారతదేశంలో ప్రతి సంవత్సరం 50 లక్షల ల్యాప్ టాప్ లు అమ్ముడుపోతున్నాయి. ఇంత పెద్ద మార్కెట్ లో మెజార్టీ వాటా దక్కించుకోవాలనే లక్ష్యంతో మార్కెట్లోకి వస్తున్నట్లు తెలిపారు క్వాల్ కామ్ టెక్నాలజీస్ ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ సీనియర్ డైరెక్టర్ మిగ్యుల్ న్యున్స్. ప్రస్తుతం జియో ఫోన్స్ తో కలిసి పని చేస్తున్నామని.. ల్యాప్ టాప్ ప్రాజెక్ట్ లోనూ భాగస్వామ్యం అవుతున్నట్లు తెలిపారు. డేటా, కంటెంట్ ఆధారంగా ఈ ల్యాప్ టాప్ ఉండబోతున్నట్లు చెప్పారు.

Comments

comments

Share this post

scroll to top