టి.వి… మీద పడి రెండేళ్ళ చిన్నారి మృతి! తల్లులూ జాగ్రత్త.

వంట గదిలో అమ్మ వంటచేస్తూ బిజీబిజీగా ఉంది. టివి రూమ్ లో రెండేళ్ల కూతురు తన ఆటలో, తనదైన లోకంలో విహరిస్తూ ఉంది. కానీ విధి ఓ పాట రూపంలో ఆ అమ్మాయిని బలి తీసుకుంది. అప్పటి వరకు  తన ఆటలో ఉన్న ఆ రెండేళ్ల చిన్నారి దృష్టి టివి నుండి వస్తున్న ఆ పాట పై పడింది. అలాగే టివి దగ్గరకు తన బుడిబుడి అడుగులతో  వెళ్లింది.  ఆ పసిపాపకు ఎం తెలుసు అవే తన చివరి అడుగులని… తను ఈ లోకం నుండి దూరంగా వెళుతున్నాని.. టివి రూపంలో మృత్యువు ఎదురవుతుందని.!

చక్రాలున్న స్టాండ్, దాని మీద టివి, అందులో నుండి  పాట. టివి స్టాండ్ ను పట్టుకొని పైకి లేద్దామనుకుంది ఆ పసిపాప . అంతలోనే స్టాండ్ మీదనున్న బరువైన  టివి… ఆ చిన్నారి తల్లి  తలపై పడింది. ఆ దెబ్బకు రక్తం ధారలుగా కారింది. అప్పటి వరకు ఆటాపాటలతో హాయిగా ఉన్న చిన్నారి ఒక్కసారిగా నెత్తుడి మడుగులో ఆచేతన స్థితిలో పడుంది.

ఆ శబ్థానికి పరుగు పరుగన వచ్చిన తల్లి తన రెండేళ్ల కూతుర్నిపట్టుకొని  బుజ్జి లేమ్మా.. తల్లీ లేమ్మా… పండు లేమ్మా..అంటూ పిలిచింది. తలకు దెబ్బ బలంగా తాకడంతో ఆ పాప సృహలో లేదు. హుటాహుటిన తమ ఊరికి దగ్గర్లోని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి పాపను తీసుకెళ్లారు. కానీ మన వ్యవస్థ అసమర్థత కూడా ఆ పాప చావుకు ఓ కారణంగా మారింది. ఆదివారం కావడంతో హాస్పిటల్ లో డాక్టర్లు ఎవ్వరూ లేరంట.. హాస్పిటల్స్ కూడా ఆదివారం హాలిడేలుంటాయాని నాకైతే అప్పుడే తెలిసింది.

అక్కడి నుండి హుటాహుటిన ప్రైవేట్ హాస్పిటిల్ కు తీసుకెళ్లి డాక్టర్ కు చూపిస్తే ..నాడీ పట్టుకున్న డాక్టర్,  ఐయామ్ సారీ.. పాప చనిపోయింది అంటూ చెప్పాడు. అల్లారు ముద్దుల కూతురు చనిపోయిందన్న విషయం తెలిసి ఆ తల్లి  సొమ్మసిల్లి పడిపోయింది. అయిదేళ్ల పాప తన చెల్లి తనతో ఆడుకోవడానికి వస్తుందని ఇంకా అమాయకంగా అన్నం తినకుండా ఎదురుచూస్తుంది.  వినోదాన్ని నింపాల్సిన టివి ఆ ఇంట్లో విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం డాక్టర్లు లేని ఆ ఆసుపత్రి  చిన్నారి మృతికి కారణం అయ్యింది.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top