తుప్పు పట్టిన ఈ కారు ధర ఎంతో తెలుసా?ఎందుకు అంత ఖరీదంటే..?

మార్కెట్లోకి రోజుకో కొత్తరకం కారు రకరకాల ఫీచర్లతో వస్తూనే ఉన్నాయి..పెరుగుతున్న అవసరాల రిత్యా చాలా మంది టూ వీలర్ నుండి కారుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.అందులో భాగంగానే ముందు సెకండ్ హ్యాండ్ కారు కొని కొద్దిరోజులు వాడాకా కొత్త కారు జోలికి వెళ్తారు.చాలా మంది తమ బడ్జెట్ కి అనుగుణంగా సెకండ్ హ్యాండ్ కారునే మెయింటెయిన్ చేస్తుంటారు.అలాంటి కార్లు సాధారణంగా మనకు అసలు ధరకంటే చాలా తక్కువకు దొరుకుతుంటాయి.అలాంటిది నలభైఏళ్ల క్రితం కారు,తుప్పు పట్టిన కారు అయితే ఎంతకు వస్తుందంటారూ.

అసలు తుప్పుపట్టిన కారుకి డబ్బులేంటండి..ఫ్రీ గా ఇస్తే తీసుకోవచ్చు..ఏ ఇనపసామాను వాడికో వేసుకుంటే కనీసం బఠానీలైనా వస్తాయి  అనుకుంటే మీరు తుప్పులో కాలేసినట్టే..ఈ తుప్పుపట్టిన కారు ఖరీదు నాలుగున్నర కోట్లు..దాని కథాకమామీషు ఏంటో తెలుసుకోండి..ముందుగా ఆ కారుకి ఎందుకు అంత క్రేజ్ అంటే.. అది ప్రఖ్యాత పోర్షే కంపెనీ కారు కాబట్టి.1955 మోడల్ కు చెందిన ఈ కారు ఇప్పటివరకూ 52837 మైళ్ళు  తిరిగింది.1950లలో తయారు చేసిన ఈ కారు అప్పటి అవసరాలకు అనుగుణంగా తయారు చేసిన స్పోర్ట్స్ కార్ అట.. 1970లలో బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని నడపలేదట… అమెరికా లోని ఓ కార్ పోర్ట్ లో దీన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టారు.

ఈ కారునే ఇప్పుడు ఫ్లోరిడాలో త్వరలో వేలం వేయనున్నారు.  ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా భారత కరెన్సీలో 4,48,29,246 రూపాయలట.. అక్షరాలా నాలుగున్నర కోట్లకు పైనే అన్నమాట.  కారు ఇంజన్ ను మార్చాల్సి ఉంటుందని పోర్షేలో పని చేసే వారు అంటున్నారు. వేలంపాటలో నాలుగున్నర కోట్ల బేస్ ప్రైస్ ను దాటి ఎవరు కొంటారా అని పోర్షే ప్రతినిధులు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు.

Comments

comments

Share this post

scroll to top