టిటిడి బోర్డు స‌భ్యుడి ఇంట్లో 100 కిలోల బంగారం .. భారీగా న‌ల్ల‌ధ‌నం.. 70 కోట్లు కొత్త‌నోట్లే….!

పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణయం జరిగి స‌రిగ్గా నెల రోజులు పూర్త‌యిన త‌రువాత ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఒక‌టి కాదు రెండు ఏకంగా 70 కోట్ల రూపాయ‌ల కొత్త నోట్ల క‌ట్టలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ద‌ర్శ‌న‌మిచ్చాయి. అది కూడా తిరుమ‌లేశుడి స‌న్నిది అయిన తిరుమ‌లలో. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు స‌భ్యుడు అయిన శేఖ‌ర్ రెడ్డి ఇంట్లో న‌ల్లధ‌నం క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా ద‌ర్శ‌న‌మిచ్చింది. భారీ మొత్తంలో బంగారం సైతం బ‌య‌ట‌ప‌డింది.new-ttd-board

తితిదే బోర్డు సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు ఒక్క సారిగా దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో క‌ళ్లు చెదిరే నిజాలు బ‌య‌ట‌కి వ‌చ్చాయి. చెన్నైలో ఉన్న అతని ఇంటితో పాటూ ఆయ‌న‌ బంధువుల ఇళ్లపై కూడా ఏకకాలంలో 8 చోట్ల సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఆ సోదాల్లో రూ.90కోట్ల పైగా నగదు బయటపడింది. అయితే ఇందులో మ‌రో షాకింగ్ న్యూస్ ఏంటంటే అందులో రూ.70 కోట్ల విలువ చేసే మొత్తం కొత్త నోట్ల రూపంలో ఉండడ‌మే. దీంతో ఐటి అధికారులు కూడా ఒక్క సారిగా షాక్ గురయ్యారు. ఇంత మొత్తంలో కొత్త నోట్లు ఎలా వ‌చ్చాయ‌ని శేఖ‌ర్ రెడ్డిని ఆరా తీస్తున్నారు. ఈ డ‌బ్బుతో పాటు వంద కిలోల బంగారం కూడా సోదాల్లో స్వాదీనం చేసుకున్నారు అధికారులు. ఈ కొత్త నోట్ల వ్య‌వ‌హ‌రంలో ప‌లువురు బ్యాంకు అధికారులు స‌హాయం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. శేఖ‌ర్ రెడ్డికి స‌బందించిన బంధువుల ఇళ్ల‌పై ఇంకా సోదాలు కొన‌సాగుతున్నాయి. ఈ సోదాల్లో 50కి మందికి పైగా ఐటీ అధికారులు పాల్గొన్న‌ట్టు స‌మాచారం. ప‌క్కా స‌మాచారం ప్ర‌కారం రంగంలోకి దిగిన అధికారులు భారీ మొత్తంలో డ‌బ్బును సీజ్ చేశారు. టిటిడి బోర్డు మెంబ‌ర్ గా ఉన్న ఈయ‌న త‌మిళ‌నాడులో ఇసుక‌, గ‌నుల వ్యాపారం చేస్తున్న‌ట్టు తెలిసింది.

Comments

comments

Share this post

scroll to top