ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ 5 టిఫిన్స్ తింటే…రోజంతా ఎలా ఉంటుందో తెలుసా..?

జీవితమంటేనే ఒడిదుడుకుల‌మ‌యం. నిత్యం ఒత్తిళ్లు, ఆందోళ‌న‌ల మ‌ధ్య స‌త‌మ‌తం అవ్వాల్సి ఉంటుంది. దీంతో శారీర‌కంగానే కాదు, మాన‌సికంగానూ అనారోగ్యం సంభ‌విస్తుంది. వ్యాయామాలు చేయ‌డం, పౌష్టికాహారం తీసుకుంటే శారీర‌క ఆరోగ్యాన్ని బాగు చేయ‌వ‌చ్చు, కానీ మాన‌సిక ఆరోగ్యం బాగుండాలంటే..? అందుకు కూడా ఆహార‌మే మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. కింద చెప్పిన ప‌లు ఆహార ప‌దార్థాల‌ను మీరు ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకుంటే చాలు, దాంతో మీ రోజు యాక్టివ్‌గా ప్రారంభం అవుతుంది. ఈ ఆహారంతో రోజంతా ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నా మాన‌సికంగా దృఢంగా ఉండ‌వ‌చ్చు. ఆందోళ‌న ద‌రి చేర‌దు. మ‌రి అలాంటి ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఉద‌యాన్నే ఒక ఆమ్లెట్ (పాల‌కూర‌తో వేసింది), పుట్ట‌గొడుగుల కూర (ప‌సుపు బాగా క‌లిపి) తీసుకోవాలి. ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను ఈ ఫుడ్‌తో పాటు తినాలి. వీలుంటే టోస్ట్ చేసిన బ్రెడ్‌, అవ‌కాడో తిన‌వ‌చ్చు. దీంతో మాన‌సిక ఆరోగ్యానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు శ‌రీరానికి అందుతాయి. రోజంతా ఆందోళ‌న‌, ఒత్తిడి ఉండ‌వు.

2. ఓట్స్‌ను ఉడ‌క‌బెట్టి అందులో పాలు లేదా బెర్రీలు (స్ట్రాబెర్రీ, చెర్రీ లాంటివి) క‌లుపుకుని తినాలి. వీలుంటే కొద్దిగా దాల్చిన చెక్క పొడిని చ‌ల్లుకుని తిన‌వ‌చ్చు. దీంతో మాన‌సిక శ‌క్తి వ‌స్తుంది. ఆందోళ‌న‌, కంగారు త‌గ్గుతాయి.

3. కొబ్బ‌రినీళ్లు, ఉడికించిన పాల‌కూర‌, పెరుగు, అర‌టి పండు, స్ట్రాబెర్రీలు. వీటిలో క‌నీసం ఏ మూడు ఆహారాల‌నైనా బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. రోజంతా ఉత్తేజంగా ఉంటారు.

4. ట‌మాటా, క్యారెట్లు, పాల‌కూర వేసి చేసిన గోధుమ ర‌వ్వ ఉప్మాను తినాలి. దీంతో చాలా పోష‌కాలు మ‌న‌కు ల‌భిస్తాయి. మాన‌సిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. మెద‌డు యాక్టివ్ అవుతుంది.

5. మెంతికూర లేదా పాల‌కూర‌, ప‌సుపు, వాము వేసి చేసిన పరోటాల‌ను తింటే అధిక పోష‌కాలు మ‌న‌కు ల‌భిస్తాయి. మెద‌డు ఉత్తేజంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న దూర‌మ‌వుతాయి.

Comments

comments

Share this post

scroll to top