“డేరా బాబా” కూతురు డైరీలో షాకింగ్ నిజాలు…16 ఏళ్ల వయసులోనే ఓ వ్యక్తికి సర్వస్వం సమర్పించి!

తనను తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ కటకటాల పాలైన నేపథ్యంలో దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి….19 సంవత్సరాల క్రితం, ఆమె 16 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో ఓ వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించి, అతనికి సర్వస్వం సమర్పించి, తిరిగి అతని ప్రేమను పొందడంలో విఫలమైంది. డేరాలో జరుగుతున్న సోదాల్లో భాగంగా హనీప్రీత్ గదిలో లభించిన ఓ డైరీలో ఇందుకు సంబంధించిన విషయాన్ని ఆమె రాసుకుంది. తన మనసులోని భావాలను కవితల రూపంలో ఆమె రాసింది.అయితే, హనీప్రీత్‌లో ప్రేమను రగిల్చిన వ్యక్తి ఎవరన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. అతను ఎవరన్నదీ, ఎలా ఉంటాడన్నదీ తెలియకపోయినా, ఈ డైరీలోని ప్రతి అక్షరం చూస్తుంటే హనీప్రీత్ అతడిని ఎంతగా ప్రేమించిందో తెలుస్తోందని అంటున్నారు.

నా మనసు విరిగిపోయిందని, నువ్వు పరిచయం కాకుండా ఉండేబాగుండునని, ఈ నిరీక్షణకు అంతం ఎప్పుడంటూ ఆమె తన విరహ వేదనను డైరీలో రాసుకుంది. ఆమె ప్రేమ అన్న మాటకు ఎన్నో నిర్వచనాలు చెప్పుకుంది.హనీప్రీత్ డేరా నుంచి తను వెళ్తూ వెళ్తూ వేలాది సీసీ కెమెరాల ఫుటేజీని ధ్వంసం చేసింది. గుర్మీత్ అకృత్యాలకు అదనపు సాక్ష్యాలు లేకుండా చేసింది. కానీ తాను దాచుకున్న డైరీని మాత్రం మరిచిపోయింది. అది అధికారుల కళ్లలో పడింది.మరోవైపు, హనీప్రీత్ కారు డ్రైవర్‌ను హర్యానా పోలీసులు రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. హనీప్రీత్ కోసం గాలిస్తున్న పోలీసులకు ఆమె డ్రైవర్ దొరికాడు. డ్రైవర్ ప్రదీప్ కుమార్‌ను హర్యానా పోలీసులు రాజస్థాన్‌లోని సలావర్‌లో అరెస్టు చేశారు.అసలీ హనీ ప్రీత్ ఎవరు…ఆమె గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..ఫేస్‌బుక్ పేజీలో తనను తాను పాపాస్ యాంజెల్‌గా పేర్కొన్న హనీప్రీత్ ఇన్సాన్ పేరుపై ఓ వెబ్‌సైట్ కూడా ఉంది. దాంట్లోనూ అద్భుతమైన తండ్రికి గొప్ప కూతురుగా తనగురించి తాను రాసుకుంది.

30 ఏళ్ల పైబడి వయసున్న ఆమె స్వస్థలం హర్యానాలోని ఫతేపూర్. దర్శకురాలు, ఎడిటర్, నటి అయిన హనీప్రీత్ 1999లో హనీప్రీత్ డేరా అనుచరుడు విశ్వాస్‌గుప్తాను వివాహం చేసుకుంది.అయితే తనని అత్తింటివారు హింసిస్తున్నారంటూ బాబా గుర్మీత్ సాయం కోరడంతో హనీని కూతురిగా దత్తత తీసుకుంటున్నట్లు 2009లో ఆయన ప్రకటించారు. గుర్మీత్ తాను నటించిన మెసెంజర్ ఆఫ్ గాడ్, ఎంఎస్‌జీ-2 చిత్రాల్లోనూ హనీకి అవకాశాలిచ్చేవారు. ఇప్పుడు గుర్మీత్‌కి శిక్ష పడటంతో డేరాకు సంబంధించిన ఆస్తులన్నింటికీ హనీపీత్ యజమానిగా వ్యవహరించే అవకాశమున్నట్లు డేరా ప్రతినిధులు చెప్తున్నారు. గుర్మీత్ రాం రహీంసింగ్ హర్‌జీత్‌కౌర్‌ను వివాహమాడారు. వారికి ఇద్దరు కుమార్తెలు చరన్‌ప్రీత్, అమన్‌ప్రీత్, ఒక కుమారుడు జస్మీత్.

Comments

comments

Share this post

scroll to top