జబర్దస్త్ వినోద్ (వినోదిని) ఆత్మహత్య వెనక పెద్ద ట్విస్ట్..! కొత్తగా వెలుగులోకి వచ్చింది..!

“జబర్దస్త్”…ఈ పేరు వినని తెలుగు వాడు ఉండరు అనుకుంట. గురువారం, శుక్రవారం వస్తే చాలు మన తెలుగు ఇళ్లలో ఈ షో తప్పకుండ చూస్తారు. లేడీ గెటప్ లో తన పెర్ఫార్మన్స్ తో “చమ్మక్ చంద్ర” టీంలో ఆక్ట్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు “వినోద్”. అసలు చాలా మంది అతను లేడీ గెటప్ లేకుండా ఎలా ఉంటాడో చూడలేదు. ఇప్పుడు అనుకోకుండా దురదృష్టపుశాత్తు “ఆత్మహత్య” ప్రయత్నం చేసుకున్నాడు “వినోద్”. అదృష్టంకొద్దీ అతని ప్రాణాలకు ఏమవ్వలేదు. అసలు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక కిడ్నప్ అయ్యాడా? వివరాలు చూడండి!

వినోద్ స్వస్థలం కర్నూల్ జిల్లా. అతని తల్లి శిరోమణమ్మ సోదరి లక్షమ్మ సంజామల మండలంలోని బొందలదిన్నెలో నివసిస్తున్నారు. సోదరి లక్షమ్మకు ఒక కూతురు ఉంది. ఆమె భర్త చనిపోవడంతో. వినోద్ తల్లి దగ్గరే తన అక్క కూతురు కూడా ఉంటుంది. లక్షమ్మ కూతురును వినోద్ కు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు కుటుంబీకులు. కానీ వినోద్ పెళ్లి కి నిరాకరించాడు. బలవంతంగానైనా పెళ్లి చేయాలనుకున్నారు బంధువులు. ఆదివారం రాత్రి వినోద్‌ను కిడ్నాప్‌ చేసి బొందలదిన్నెకు తీసుకొచ్చారు.

వినోద్ ను కిడ్నప్ చేసి తీసుకొచ్చే క్రమంలో వినోద్ కుడి చెయ్యికి స్వల్ప గాయాలు అయ్యాయి. మీడియా వాళ్ళు అది ఆత్మహత్య అని ప్రచురించారు. సోమవారం ఉదయం అక్క కూతురితో పెళ్లి చేయడానికి ప్రయత్నించగా నిరాకరించాడు. ఇంతలో కిడ్నాప్‌ సమాచారం పోలీసులకు అందడంతో సంజామల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనితో పోలీసులు వినోద్ బంధువులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కిడ్నాప్‌ విషయమై వినోద్‌ను విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆయన వివరించారు.

Comments

comments

Share this post

scroll to top