ఆ న్యూస్ రిపోర్టర్ ను సోషల్ మీడియా అన్యాయంగా చంపేసింది..? దానిపై స్పందించి ఆమె ఏమందంటే! [VIDEO]

ఓ చానెల్‌కు లైవ్ ఇస్తూ స్పృహతప్పి క్రేన్‌పై నుంచి పడిపోయిన పాకిస్థాన్ రిపోర్టర్ ఇర్జా ఖాన్.. చనిపోలేదు. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉండటంతోపాటు న్యూస్ యాంకర్‌గా వార్తలు చదువుతోంది. అయితే, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాలో ఆమె కిందపడిపోతున్న వీడియోలతో ‘లైవ్‌లోనే చనిపోయిన మహిళా రిపోర్టర్’ అని ప్రచారం జరుగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా ట్రెండ్ అవుతోంది.

ఈ విషయం ఆమెవరకు చేరింది. దీంతో.. ఆమె ట్విట్టర్ అకౌంట్ ద్వారా ‘‘నేను బతికే ఉన్నా. దయచేసి నమ్మండి’’ అంటూ ట్వీట్ చేసింది. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిపోయింది. ఆమె మొర ఎవరూ పట్టించుకోవడం లేదు.

watch video here:

అసలేం జరిగింది?:

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో చోటుచేసుకుంది. టీవీ 92 ఛానెల్‌కు చెందిన ఇర్జా ఖాన్.. సభా ప్రాంగణం మొత్తం కనిపించడం కోసం క్రేన్‌పై కూర్చొని లైవ్ ఇవ్వడం ప్రారంభించింది. ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయింది. దాదాపు పది అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయింది. దీంతో, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన ఏడాది కిందట చోటు చేసుకుంది. ‘‘తీవ్రమైన ఎండలో తిరగడం వల్ల అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయానని, పైనుంచి పడటం వల్ల నడుముకు గాయమైంది’’ అని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్‌లో ఏఆర్‌వై న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తోంది. రోజు పాకిస్థాన్ టీవీలో కనిపిస్తోంది. అయితే.. ఈ రూమర్లు చూసి ఆమె షాకైంది.

తనకు ఎదురవుతున్న అనుభవాల గురించి చెబుతూ.. ‘‘మా టీచర్ ఫోన్ చేశారు. నేను హలో అన్నాను. అదేంటీ నువ్వు ఇంకా బతికే ఉన్నావా? మీ ఇంట్లో వారికి సంతాపం తెలియచేద్దామని ఫోన్ చేశా’’ అని చెప్పారంటూ వాపోయింది. న్యూస్ చానెళ్లల్లో ట్రెండ్ అవుతోన్న తన వార్తల క్లిప్పింగులు కూడా పెట్టి… ఇంకా నా ‘చావు’ వార్తలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపింది. అయితే, ఇండియాలో మాత్రం నేను బతికే ఉన్నానే వార్తలు టీవీల్లో రావడం సంతోషం కలిగిస్తుందని, భారతీయు ప్రజలు తనపై ఎంత ప్రేమ చూపించారని, అందరికీ తన ధన్యవాదాలని పేర్కొంది.
ఇండియా మీడియాకు ధన్యవాలు చెప్పిన ఇర్జా ఖాన్

Comments

comments

Share this post

scroll to top