“హార్దిక్ పాండ్య” జడేజాను తిడుతూ ట్వీట్ చేయడం వెనకున్న అసలు కథ ఇదే..! క్రికెట్ ఫాన్స్ తప్పక తెలుసుకోవాలి!

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది. ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. మ్యాచ్‌లో తన శక్తి మేర పోరాడినా.. రనౌట్‌గా పెవిలియన్ చేరిన హార్ధిక్ పాండ్య అయితే.. భారత్ ఓటమిని ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. ఫైనల్లో 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన కోహ్లి సేన 180 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలైంది. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైన వేళ.. జడేజాతో కలిసి హార్ధిక్ పరువు కాపాడే ప్రయత్నం చేశాడు. సిక్సర్లతో విరుచుకుపడిన పాండ్య పాక్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఘోర పరాజయం ఖాయం అనుకునే స్థితి నుంచి భారత్ పోరాడింది.. అనిపించడానికి శక్తిమేర ప్రయత్నించాడు. ఆ క్రమంలో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 43 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు.

హార్దిక్ పాండ్య బ్యాటింగ్ చూశాక భారత అభిమానులలో గెలుపు ఊరట చిగురించింది. అతడు మరికాసేపు ఆడితే పాక్‌లో గుబులు మొదలయ్యేదే. కానీ ఈ స్థితిలో అనవసర పరుగుకు పిలిచిన జడేజా తర్వాత వెనక్కి వెళ్లిపోయాడు. కానీ అప్పటికే సగం దూరం వచ్చేసిన పాండ్య రనౌట్‌ అయ్యాడు. అలా అవుటవ్వడం అతడిలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. తను ఎంతగా బాధపడుతున్నాడో, లేని పరుగు కోసం రనౌట్ అవడం వల్ల ఎంత కోపంగా ఉన్నాడో.. పెవిలియన్ చేరే సమయంలో అతడి ముఖం చూసే చెప్పొచ్చు..!

మ్యాచ్ ఓడిన తర్వాత ట్వీట్ చేసాడు పాండ్య.. “ప్రత్యర్థికి అంతటి సామర్థ్యం లేకున్నా.. మా చేజేతులా మేమే ఓడిపోయాం, మమ్మల్ని మేమే దొంగతనం చేసుకున్నాం అంటూ ట్వీట్ చేశాడు.”  వెంటనే దాన్ని తొలగించినప్పటికీ.. అది వైరల్‌గా మారింది. కాని వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేసాడు. వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చూసి కొందరు తిడుతున్నారు, కొందరు అర్ధం చేసుకుంటున్నారు. కాని అసలు కథ వేరే ఉంది. క్రికెట్ కి సంబందించిన ఒక వెబ్సైటు హార్దిక్ పాండ్య అలా ట్వీట్ చేసినట్టు సృష్టించి, డిలీట్ చేసాడని వార్త వైరల్ అయ్యేలా చేసింది. నిజానికి అతను ఏమని ట్వీట్ చేసాడో చూడండి!

ఆ వెబ్ సైట్ ట్విట్టర్ లో “పాండ్య” ట్వీట్ ఓపెన్ చేసి F 12 కీ ప్రెస్ చేసింది. దాంతో ఆ ట్వీట్ ఎడిట్ చేయొచ్చు. అలా ఎడిట్ చేసి న్యూస్ వైరల్ అయ్యేలా చేసింది! తర్వాత నిజం తెల్సుకున్న నెటిజన్లు ఆ వెబ్సైటు పై తిట్ల వర్షం కురిపించారు!

Comments

comments

Share this post

scroll to top