నిన్ను విడిచినాకనే నా లైఫ్ లో మళ్ళీ సంతోషం చూడగలిగా – ట్రూ స్టోరీ.!!

ఎంతో గాఢం గా ప్రేమించిన అమ్మాయి దూరం అయితే, ఆ బాధను మాటల్లో వర్ణించలేము. తను ఈ లోకం విడిచి పెట్టి వెళ్ళిపోతే మనం బ్రతికున్నంత కాలం మన జ్ఞాపకాల్లో ఉంటుంది. కానీ మనల్ని మోసం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే మన మనసంతా తనే ఉంటుంది, ప్రేయించిన పాపానికి మన మనసు నుండి ఎప్పటికి బయటికి పోకుండా అలాగే మనల్ని ఇంకా బాధ పెడుతూ ఉండిపోతాది.

నేను 10th క్లాస్ నుండి ఇప్పటి వరకు ఒక అమ్మాయి నే ప్రేమించాను, తనే నా జీవితం, నా ప్రాణం అనుకున్న, చదువుతున్న రోజుల్లో తనను మొదటి సారి చుసిన సమయం నుండి ఇప్పుడు పని చేస్తున్న సమయం వరకు తన గురుంచి ఆలోచించని రోజంటూ లేదు. తనని ప్రేమించి 8 సంవత్సరాలు అవుతుంది, ఇంకో 80 సంవత్సరాలు అయినా నేను తనను మర్చిపోలేను, అంతలా తనను ప్రేమించాను ప్రేమిస్తున్నా ప్రేమిస్తూనే ఉంటా.

నన్ను విడిచి వెళ్ళడానికి ఒక్క సరైన కారణం కూడా లేదు తన దెగ్గర, వాళ్ళ ఇంట్లో వాళ్ళను విడిచి నాతో రాలేక, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం చేసుకోడానికి సిద్ధపడింది తను, తనే సర్వం అనుకున్న నేను, సన్యాసి గా మారాలి అనుకున్నా, కానీ తల్లి తండ్రులు గుర్తు వచ్చి తన మీద ఉన్న ప్రేమను గుండెల్లోనే బంధించి కష్ట పడి పని చేస్తున్నా, బ్రతికున్నంత కాలం తల్లి తండ్రులకు సేవ చేసుకుంటూ, వారికి కష్టం రాకుండా చూసుకుంటా. నా జీవితం లో ఇంకొక అమ్మాయి రావొచ్చు రాకపోవచ్చు, కానీ నా జీవితం తను ఎప్పటికి చెరిగిపోని ఒక కల వలె నిలిచిపోతుంది. తన జ్ఞాపకాలు నా మనసులో బందించి తల్లి తండ్రుల కోసం కష్టపడటం మొదలు పెట్టాక మళ్ళీ సంతోషం చూడగలిగా.

నా లాగే ఎంతో మంది ప్రేమికులు తాము ప్రేమించిన వారిని తలుచుకుంటూ బాధ పడుతూ జీవితం గడిపేస్తారు, బాధను గుండెల్లో దాచుకొని జీవితం లో ముందుకు సాగేవాడే అసలైన ప్రేమికుడు, జీవితం లో ముందుకు సాగడం ఎప్పటికి ఆపకండి – ధీమంత్ కుమార్ (ధీము)

Comments

comments

Share this post

scroll to top