స్నేహం..కోసం ప్రాణాల‌కు తెగించి మ‌రీ సాహసం చేసిన శున‌కం.

డ‌బ్బు కోసం…ప్రాణ స్నేహితుల‌ను సైతం మోసం చేసే ఈ లోకంలో..స్నేహం కోసం ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టిన ఓ శున‌కం చేసిన సాహ‌సం గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.! ఉక్రెయిన్ లో లూసీ అనే ఆడ‌కుక్క కాలికి దెబ్బ‌త‌గిలి..ట్రైన్ ట్రాక్ మీద క‌ద‌ల‌లేని స్థితిలో ఉండిపోయింది, ఇది చూసిన లూసీ ఫ్రెండ్ పాండా( మ‌గ‌కుక్క‌) ఎలాగైనా స్నేహితురాలిని కాపాడాల‌ని అనుకుంది, లూసీ మీద పేరుక‌పోయిన మంచును తొల‌గిస్తుంది, స‌డెన్ గా అదే టైమ్ లో ఆ ట్రాక్ మీద ట్రైన్ దూసుకు వ‌స్తుంది. వెంట‌నే పాండా లూసీని ట్రాక్ కు స‌మాంత‌రంగా ఉండేలా అదిమిప‌ట్టింది, వేగంగా దూసుకువ‌చ్చిన రైలు వారి మీదినుండి పోయింది, అయిన‌ప్ప‌టికీ….లూసీ , పాండాలు స‌జీవంగా బ‌య‌ట‌ప‌డ్డాయి.

panda

త‌న ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా…..త‌న స్నేహితురాలి ప్రాణాల‌ను ర‌క్షించిన పాండా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో రియ‌ల్ హీరో అయ్యింది. మ‌న‌కూ ఓ పాండా లాంటి ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుంది.

#Watch Video:

Comments

comments

Share this post

scroll to top