త‌న B.Ed స‌ర్టిఫికేట్ ను అమ్మ‌కానికి పెట్టిన విద్యార్థి….దీంతో అయినా ప్ర‌భుత్వం క‌ళ్లు తెర‌వాలి.!?

టీచ‌ర్ కావాల‌న్న‌ది ఆ విద్యార్థి క‌ల‌.! అందుకోసం అహ‌ర్నిష‌లు క‌ష్ట‌ప‌డ్డాడు. 2012 లో 1 మార్క్ తో DSC మిస్ అయ్యింది. చాలా బాధ‌ప‌డ్డాడు…త‌న‌కు తానే బెట‌ర్ ల‌క్ నెక్ట్స్ టైమ్ అనుకున్నాడు… 2012 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు DSC కోసం వెయిట్ చేస్తున్నాడు..చివ‌ర‌కు తెలంగాణ ప్రభుత్వం TRT నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ 2012 లో DSC రాసి 1 మార్కులో ఉద్యోగం కోల్పోయిన ఆ విద్యార్థిని 2017లో TRT రాయ‌డానికి అన‌ర్హుడిగా పేర్కొంది తెలంగాణ స‌ర్కార్.!!

ఎందుకిలా…?
2008 లో BA చేసిన అశోక్ అనే ఈ విద్యార్థికి డిగ్రీలో 48.25% …ఇదే అర్హ‌త‌తో …B.Ed లో జాయిన్ అయ్యి 54 శాతం తో పాస్ అయ్యాడు. టీచ‌ర్ ఉద్యోగం కావాలంటే….TET క్వాలిఫై కావాల్సిందేన‌ని మ‌ద్య‌లో మెలిక పెట్టారు ఏలిక‌లు…. స‌రే అని మ‌ళ్లీ సైకాల‌జీ, మెథ‌డాల‌జీ అంటూ క‌ష్ట‌ప‌డి… TET క్వాలిఫై అయ్యాడు. ఇదే క్ర‌మంలో PG చేసి 75% మార్కుల‌తో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టా పొందాడు.! ఓసారి DSC, 5 సార్లు TET రాసిన‌….ఈ విద్యార్థిని… ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హించే TRT ప‌రీక్ష‌కు అన‌ర్హుడిగా ప్ర‌క‌టించేశారు. ఎందుకంటే…డిగ్రీలో ఓపెన్ కేట‌గిరీ వారికి 50 శాతం, బిసీల‌కు 45 శాతం మార్కులు సాధిస్తేనే TRT కి అర్హులంట‌.! ఎప్పుడూ లేనిది స‌డెన్ గా ఈ నిబంధ‌న దేనికి….? B.Ed లో జాయిన్ అవ్వ‌డానికి 40 శాతం మార్కులు ఉంటే స‌రిపోతుంది, TET రాయ‌డానికి 40 శాతం ఉంటే స‌రిపోతుంది (ఇప్పుడు పెంచారు)… కానీ TRT కి మాత్రం 50 కావాల‌న‌డం వెనుక ఆంత‌ర్యం ఏంటి? అనేదే అస‌లు ప్ర‌శ్న‌?

ఇదేదో…B.Edలో జాయిన్ కాక‌ముందే చెబితే….B.Ed అని,TET అని టైమ్ వేస్ట్ చేసుకోకుండా…వేరే ప‌నైనా నేర్చుకుని కుటుంబానికి ఆస‌రా అయ్యే వాడిని క‌దా…అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు అశోక్….

ఇదే విష‌యంపై TSPSC ని సంప్ర‌దిస్తే…వ‌చ్చిన స‌మాధానం.!
మాకేం సంబంధం లేదు…మేము జ‌స్ట్ ఉద్యోగాల‌ను ఫిల్ చేస్తాము…క్వాలిఫికేష‌న్ ను ఫిక్స్ చేసేది మేం కాదు అని చేతులు దులుపుకుంటున్నారు.! మీ త‌ర‌ఫున ఓ ఫార్వ‌ర్డ్ లెట‌ర్ ప్ర‌భుత్వానికి రాయండి..ఇది నా ఒక్క‌డి స‌మ‌స్య కాదు, DSC నే న‌మ్ముకున్న వేల మంది విద్యార్థుల‌ స‌మ‌స్య అని వివ‌రించినా…లైట్ తీసుకున్నారు.

ఇది నా బీఈడీ సర్టిఫికేట్.. అమ్ముతాను..ఎవరైనా కావాలంటే చెప్పండి ఇస్తా.. మీరిచ్చిన డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేస్తా.! తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో…. దీనితో నాకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది ! 36% మార్కులు వచ్చిన వాడు కలెక్టర్ అవ్వచ్చు..గ్రూప్ 1 అవ్వచ్చు.. కానీ టీచ‌ర్ కావ‌డానికి అర్హ‌త లేదు అన‌డం ఆశ్చ‌ర్యం క‌ల్గిస్తుంది.! అందుకే నా మెమో ను అమ్మ‌కానికి పెట్టా…..ఎవ్వరూ కొనకపోతే కోదండరాం సార్ సమక్షంలో యూనివర్సిటీ వారికి రిటర్న్ ఇచ్చేస్తా…నేను ఎవ్వరి మీద కోపంతో ఈ మాటలు చెప్పట్లేదు…ఒక నిరుద్యోగిగా…నా బాధ చెప్పుకున్నా.!
—————————————————————అశోక్. (TRT అవ‌కాశం కోల్పోనున్న అభ్య‌ర్థి)

నేను 3 సంవ‌త్స‌రాల నుండి DSC కి ప్రిపేర్ అవుతున్న‌….ఈ క్ర‌మంలో PG,M.Ed లు కంప్లీట్ చేశా…నా ప‌రిస్థితి ఇప్పుడెలా ఉందంటే…నేను డైట్ లెక్చ‌ర‌ర్ పోస్ట్ కు అర్హుడిని,M.E.O, D.E.O పోస్టుల‌కు కూడా అర్హుడిని, బ‌ట్ టీచ‌ర్ పోస్ట్ కు అర్హుడిని కాదు.! ఈ ఆలోచ‌నే వింత‌గా ఉంది, ఇది మ‌న పాల‌కుల‌కే చెల్లింది.!
——————————————————————- లింగ స్వామి ( TRT అవ‌కాశం కోల్పోనున్న అభ్య‌ర్థి) .

క్వాలిటీ ఎడ్యుకేష‌న్ ను అందించే క్ర‌మంలో ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని స‌వ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది… 2015 త‌ర్వాత డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి ఈ నింబంధ‌న వ‌ర్తిస్తుంది అంటే బాగుంటుంది..అలా అని కాకుండా…. ఎప్పుడు చ‌దివినా డిగ్రీలో 50 శాతం మార్క్స్ ఉండాలి అన‌డం క‌రెక్ట్ కాదు. తెలంగాణ వ‌చ్చాక ఏజ్ లిమిట్ కూడా పెంచిన క్ర‌మంలో…. ఈ నిర్ణ‌యం మ‌రింత అవివేకం అవుతుంది. 2009 కు ముందు డిగ్రీ పాస్ అవ్వ‌డమే గ‌గ‌నం..తెలంగాణ ఉద్య‌మ సంద‌ర్భం కాబ‌ట్టి..కొన్ని యూనివ‌ర్సిటీలు ప‌ర్సెంటేజ్ లు సైతం ఇవ్వ‌లేదు…ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధ‌న‌ను స‌డ‌లించాలి.
——————————————————-అల్వాల మ‌ధుసూధ‌న్ ( B.Ed విద్యార్థుల సంఘం, అధ్య‌క్షులు)

Comments

comments

Share this post

scroll to top