చిరంజీవి VS బాలకృష్ణ.. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ట్రోల్ వీడియోస్..!!

మజ్జిగ లో చెక్కర వేస్తే తియ్య్యగా ఉంటది అనేది ఎంత నిజమో మెగా స్టార్ చిరంజీవి గారి అభిమానులకి నందమూరి నటసింహం బాలకృష్ణ గారి అభిమానులకి పడదు అనే మాట కూడా అంతే నిజాము, వీరిరువురి ఫ్యాన్స్ మధ్యన ఎప్పుడు ఏదో ఒక రకమైన ట్రోల్ల్స్ జరుగుతూనే ఉంటాయి సోషల్ మీడియా లో, తాజాగా కొత్త ట్రెండ్ మొదలయ్యింది సోషల్ మీడియా లో, అదేంటో తెలిస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.

అప్పట్లో చిరు గారు, బాలయ్య గారు…:

చిరంజీవి, బాలకృష్ణ పాత సినిమాల్లో ఫైట్ సీన్స్ లో కొంచెం మసాలా ఎక్కువగా ఉండేది, అప్పట్లో డైరెక్టర్స్ వారిరువురి చేత చిత్ర విచిత్రమైన స్టన్ట్స్ చేయించారు, ఆ స్టన్ట్స్ ఇప్పుడు చూస్తే అభిమానులు కూడా నవ్వుకుంటారు, ఇప్పటికి కూడా మన తెలుగు సినిమాల్లో ఫైట్స్ హాలీవుడ్ బాలీవుడ్ ని తల తన్నెల ఉంటాయి, కానీ ఇటీవల కాలం లో ఆ రేంజ్ ఫైట్స్ తగ్గిపోయాయి, ఈ మధ్య కాలం లో వచ్చిన సినిమాల్లో వినయ విధేయ రామ చిత్రం లో మళ్ళీ నేల ఆకాశం ఫైట్స్ చూసాం, సోషల్ మీడియా లో చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ పుణ్యమా అంటూ రోజుకొక మర్చిపోలేని ఫైట్ సీన్స్ చూస్తున్నాం. చిరంజీవి, బాలకృష్ణ హీరో లుగా నటించిన పాత చిత్రాల్లో నేల ఆకాశాన్ని మించిన కొన్ని ఫైట్ సీన్ వీడియోస్ ని సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ట్రోల్ వీడియోస్..:

ఇరువురి ఫ్యాన్స్ లో ఏ ఒక్కరు తగ్గట్లేదు, తు అప్లోడ్ మై అప్లోడ్ అంటూ ఒకరిని చూసి మరొకరు వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నారు. వీరిరువురి పాత సినిమాల్లోని వీడియోస్ ని మాత్రమే వాడుతుండటం తో కొందరు మళ్ళీ వీరి పాత సినిమాలను నెమరువేసుకుంటున్నారు.

Watch Videos :

Comments

comments

Share this post

scroll to top